Share News

గెలుపే లక్ష్యంగా పొత్తులు..

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:35 PM

మునిసిపల్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల చిత్ర విచిత్రాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పా ర్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీ అంతరంగిక ఒప్పందంతో అ ధికార పార్టీ అభ్యర్థులను ఓడించాలనే లక్ష్యంతో పావులు కదుపుతుండగా, కొన్ని చోట్ల సీపీఐతో బీఆర్‌ఎస్‌ జతక డుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకే తన మద్దతు ప్రకటించిన సీపీఐ నాయకులు, ప్రస్తుత మునిసిపల్‌ ఎలక్షన్లనో మాత్రం తన పంథా మార్చుకు న్నారు.

గెలుపే లక్ష్యంగా పొత్తులు..

మునిసిపల్‌ ఎన్నికల్లో ఏకమైన ప్రతిపక్షాలు..!

-కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా పావులు

మంచిర్యాలలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ అవగాహన

-క్యాతన్‌పల్లిలో సీపీఐ, బీఆర్‌ఎస్‌ మధ్య కుదిరిన ఒప్పందం

మంచిర్యాల, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల చిత్ర విచిత్రాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పా ర్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీ అంతరంగిక ఒప్పందంతో అ ధికార పార్టీ అభ్యర్థులను ఓడించాలనే లక్ష్యంతో పావులు కదుపుతుండగా, కొన్ని చోట్ల సీపీఐతో బీఆర్‌ఎస్‌ జతక డుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకే తన మద్దతు ప్రకటించిన సీపీఐ నాయకులు, ప్రస్తుత మునిసిపల్‌ ఎలక్షన్లనో మాత్రం తన పంథా మార్చుకు న్నారు. మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన త రువాత ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించిన ఆ యా పార్టీల నాయకులు నామినేషన్ల పర్వం ముగిసిన తరు వాత పొత్తులకు తెరలేపుతున్నారు. ఈ నెల 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉండగా, 11న అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరుగ నున్నాయి. మునిసిపాలిటీల్లో విజయం సాధించడమే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న అన్ని పార్టీల నాయకులు వీలైనన్ని ఎక్కువ స్థానాలను సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని మంచిర్యాల మునిసిపల్‌ కార్పొరేషన్‌ తోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట మునిసిపా లిటీల్లోని మొత్తం 149 వార్డులకు ఎన్నికలు జరుగుతు న్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపట్ల కూడా అవసరమై న జాగ్రత్తలు తీసుకున్నారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపే పనిలో ఆయా పార్టీల నేతలు తల మునకలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌ ఎస్‌ తరుపున ఒక్కో స్థానానికి ఇద్దరు ముగ్గురు అభ్య ర్థుల చేత నామినేషన్లు దాఖలు చేయించినట్లు తెలు స్తోంది. మంచిర్యాల కార్పొరేషన్‌లో అధికార కాంగ్రెస్‌ ఇ ప్పటికే తన అభ్యర్థులను ప్రకటించగా, మిగతా రెండు ప్రధాన పార్టీలు నామినేషన్ల ఉపసంహరణ సమయం వరకు వేచి ఉండాలనే ధోరణితో ఉన్నాయి. అప్పటి వర కు పరిస్థితిని అంచనా వేయడం ద్వారా అధికార పార్టీ అభ్యర్థుల కంటే బలమైన వారిని బరిలో నిలిపేలా ఇరు పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య అంతరంగిక ఒప్పందం...!

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎడ మొహం, పెడ మొహంగా ఉన్నప్పటికీ, మంచిర్యాల కార్పొరేషన్‌లో మాత్రం ఆ రెండు పార్టీలు అంతరంగిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు బాహాటంగా ప్రచారం జ రుగుతోంది. కార్పొరేషన్‌లో అధికార పార్టీ బలంగా ఉం డటంతో మునిసిపల్‌ ఎన్నికల్లో ఎలాగైనా అడ్డుకట్ట వే యాలనే ఆలోచనతో సీట్ల సర్దుబాటు చేసుకుంటున్న ట్లు ప్రచారం జరుగుతోంది. పరస్పర అవగాహనతో ఎ క్కువ సంఖ్యలో సీట్లు గెలవాలని ఇరు పార్టీల నాయకు లు అవగాహన కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇందు లో భాగంగా బీజేపీ తరుపున బలమైన అభ్యర్థి ఉన్నచో ట బీఆర్‌ఎస్‌ నామ మాత్రంగా అభ్యర్థిని నిలబెట్టడం... బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న చోట బీజేపీ వెనక్కి తగ్గడం లాంటి చర్యలు చేపడుతున్నట్లు జోరుగా చర్చ సాగు తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ అభ్యర్థి బలంగా ఉన్నచోట ఓడించడానికి పరస్పర సహకారంతో ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించినట్లు చర్చ జరుగుతోంది. కా ర్పొరేషన్‌ పరిధిలో దాదాపు పది డివిజన్‌లలో కాంగ్రెస్‌ కు బలమైన అభ్యర్థులు లేరు. దీన్ని ఆసరాగా తీసుకో వడం ద్వారా ఈ సీట్లను కైవసం చేసుకునేందుకు ఇరు పార్టీల సంయుక్త అభ్యర్థిని బరిలో దింపుతున్నట్లు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌తో సీపీఐ జత....

ఇక జిల్లాలోని మిగతా మునిసిపాలిటీల పరిధిలో ప్ర ధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ నాయకులు సీపీఐతో జ తకడుతున్నారు. క్యాతన్‌పల్లి మునిసిపాలిటీకి సంబంధిం చి రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తున్న ట్లు సీపీఐ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కలవేణి శంకర్‌లు ఏకంగా ప్రెస్‌మీట్‌లోనే ప్రకటించారు. బీఆర్‌ ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ నేతృత్వంలో రెండు పార్టీల నాయకులు పరస్ప రం అంగీకారానికి రాగా క్యాతన్‌పల్లిలో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించేందుకు రంగం సిద్దమైంది. అలాగే బెల్లంపల్లి మునిసిపాలిటీలోనూ బీఆర్‌ఎస్‌, సీపీఐ కలిసి పని చేస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నాయకుల మధ్య చర్చలు కూడా జరుగుతుండగా, చెన్నూరు మునిసిపాలిటీలోనూ అదే పరిస్థితి నెలకొంది. మొత్తంగా మునిసిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పొత్తుల వ్యవహారం వెలుగు చూడటంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.

Updated Date - Jan 31 , 2026 | 11:35 PM