మంత్రిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:32 PM
రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చెన్నూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి చెన్నూరు నియోజ కవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మూల రాజిరెడ్డి ఆరోపించడం అత ని విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మంత్రి వివేక్‌వెంకటస్వామి వారానికి రెం డు సార్లు స్థానికంగా ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారన్నారు.
చెన్నూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చెన్నూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి చెన్నూరు నియోజ కవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మూల రాజిరెడ్డి ఆరోపించడం అత ని విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మంత్రి వివేక్‌వెంకటస్వామి వారానికి రెం డు సార్లు స్థానికంగా ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారన్నారు. కావాలనే కొందరు మంత్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. చెన్నూరు నియోజకవర్గానికి మంత్రి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు. రూ. 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూ ల్ నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రతి మున్సిపాలిటీలో వంద కోట్ల నిధుల తో అమృత్ 2.0 పథకం ద్వారామంచినీటి సరఫరా చేయనున్నారన్నారు. మంత్రిపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మహేష్ ప్రసాద్ తివారీ, నాయకులు పాల్గొన్నారు.