తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా నిలవాలి
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:37 PM
కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా తెలం గాణ ప్రజలంతా ఐక్యంగా నిలవాలని నాగర్‌క ర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కోరారు.
- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
- బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ సమైక్యతా దినోత్సవం
నాగర్‌కర్నూల్ టౌన్/ కల్వకుర్తి/ కొల్లా పూర్/ పెంట్లవెల్లి/ వెల్దండ/ తిమ్మా పే ట, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా తెలం గాణ ప్రజలంతా ఐక్యంగా నిలవాలని నాగర్‌క ర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ ఎస్ కార్యాలయంలో తెలంగాణ సమైక్యత దినో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన జా తీయ పతాకావిష్కరణ చేశారు. ఆయన మా ట్లాడుతూ సెప్టెంబరు 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని, ప్రజాస్వామ్య విలువలు, స్వే చ్ఛ కోసం పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకోవాల న్నారు.
కల్వకుర్తి పట్టణంలోని జేపీనగర్ సమీపంలో ని భగత్‌సింగ్ తండాలో బీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను స్మరించుకుంటూ క్షీరాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తిలో గిరిజన తండాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమానికి కేసీ ఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించాలని తెలిపారు. కార్యక్ర మంలో యువ నాయకుడు తరుణ్ రాథోడ్, మాజీ మునిసిపల్ చైర్మన్లు ఎడ్మ సత్యం, శ్రీశై లం, మాజీ మార్కెట్ చైర్మన్ విజయ్‌గౌడ్, బీ ఆర్‌ఎస్ నాయకలు, యువ నాయకులు భగత్ సింగ్, తండావాసులు పాల్గొన్నారు. ఫ తెలంగా ణ విమోచన దినోత్సవం సందర్భంగా కొల్లాపూ ర్ మండలం బోడబండ తండాలో గిరిజన మహిళలు, నాయకులతో కలిసి మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కొల్లాపూర్ మాజీ శాసన సభ్యుడు బీరం హర్షవర్ధన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్ర మంలో మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, గిరిజ న మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొ న్నారు. ఫ తెలంగాణ విమోచన దినోత్సవం పు రస్కరించుకొని పెంట్లవెల్లి, మంచాలకట్ట, మ ల్లేశ్వరం, జటప్రోలు, గోప్లాపురం తదితర గ్రా మాలలో ఆయా గ్రామాల సర్పంచులు జాతీయ జెండాను ఎగరవేశారు. పెంట్ల వెల్లి సర్పంచు చిట్టెమ్మ, నాయకులు గో వురాజు, కురుమూర్తి, ఖలీల్, భరత్ పాల్గొన్నారు. ఫ వెల్దండలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి హాజరై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పుట్ట రాంరెడ్డి, అనిల్‌కుమార్, జోగయ్య, నిరంజన్, అంజిమాస్టర్, ఆనంద్ ఉన్నారు.