kumaram bheem asifabad- పల్స్ పోలియోకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:03 PM
చిన్నారుల జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో మహమ్మరిని నిర్మూలించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం నేటి నుంచి మూడు రోజుల పాటు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని 0-5 పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది.
- 15 పీహెచ్‌సీల పరిధిలో టీంల ఏర్పాటు
- జిల్లా వ్యాప్తంగా 46,516 మంది చిన్నారులు
ఆసిఫాబాద్‌రూరల్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): చిన్నారుల జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో మహమ్మరిని నిర్మూలించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం నేటి నుంచి మూడు రోజుల పాటు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని 0-5 పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. అటవీ ప్రాంతాలు, గుట్టలపై ఉన్న గ్రామాలు, వాగు అవతల ఉన్న చిన్నారులను గుర్తించిన వైద్యాధికారులు 86 రూట్లను విభజించారు. ఈ రూట్లకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసింది. పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 7 గంట లకే పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హరిత ప్రారంబించనున్నారు.
- హైరిస్క్ ఏరియాల్లో..
హైరిస్క్ ఏరియాలను గుర్తించి వైద్యాధికారులు, సబ్ సెంటర్ల సిబ్బంది అక్కడికి వెళ్లే ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇతర రాష్ట్రల నుంచి వలస వచ్చిన కూలీలు పిల్లలతో పాటు ఇతర వ్యవసాయ పనులు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికులు నివాస ప్రాంతాలకు సైతం టీంలను పంపనున్నారు. ఐరిస్క్ ఏరియాలను గుర్తించి వైద్యాధికా రులు, సబ్ సెంటర్ల సిబ్బంది అక్కడికి వెళ్లే ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇదే కాకుండా ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల పరిధిలోని పిల్లల వద్దకు సైతం వైద్య సిబ్బంది వెళ్లి చుక్కలు వేయనున్నారు. కాఆగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా చిన్నారులకు పోలియోరాదు. అంగవైక ల్యాన్ని నివారించడంతో పాటు జీవితాంతం రక్షణ ఉంటుంది. సురక్షితమైన, ఉచితమైన ఈ మం దును తప్పకుండా చిన్నారులందరికీ తప్పకుండా వేయించాలని సోషల్ మీడియా, వాల్ పోస్టర్లు, ఇతర ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ చేపట్టింది. పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు ఉన్నా కూడా ఈ పోలియో చుక్కలను వేయించవచ్చని అధికారులు చెబుతున్నారు.
సిబ్బంది కేటాయింపు వివరాలు ఇలా..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 15
సబ్ సెంటర్లు : 118
జిల్లాలోని చిన్నారులు : 46,516
మొబైల్ బృందాలు : 22
రూట్ సూపర్‌వైజర్లు : 86
పోలియో చుక్కలు వేసే బూత్‌ల ు: 667
మొత్తం సిబ్బంది : 2,668
విధిగా పోలియో చుక్కలు వేయించాలి..
- సీతారాం, జిల్లా వైద్యాధికారి
ఐదేళ్లలోపు చిన్నారులకు విధిగా పోలియో చుక్కలు వేయించాలి. ప్రతి గ్రామం, వార్డు ల్లో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశాం. సిబ్బందికి తగిన సూచనలు చేశాం. ఈ