ఆడబిడ్డలందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:40 PM
గర్భాశ య క్యాన్సర్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఆడబి డ్డలందరూ వేయించుకోవాలని ఎమ్మెల్యే వంశీ కృష్ణ కోరారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ - అచ్చంపేట ఆస్పత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభం
అచ్చంపేట,మార్చి8 (ఆంధ్రజ్యోతి) : గర్భాశ య క్యాన్సర్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఆడబి డ్డలందరూ వేయించుకోవాలని ఎమ్మెల్యే వంశీ కృష్ణ కోరారు. అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో ఆదివారం హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎ మ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ఆ యన మాట్లాడుతూ 9నుంచి 14 సంవత్సరా ల బాలికలకు ఉచితంగా టీకాలు వేస్తున్నారని తె లిపారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి తారాసింగ్, డీసీహెచ్‌ఎస్ రామకృష్ణ, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రదీప్, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ రాజేందర్, మార్కెట్ క మిటీ చైర్మన్ రజితమల్లేష్, ఓబీసీ సెల్ గిరివ ర్ధన్‌గౌడ్, డాక్టర్లు,నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాలికలకు హెచ్‌పీవీ టీకాలు పంపిణీ
అమ్రాబాద్, (ఆంధ్రజ్యోతి) : అమ్రాబాద్ ప్ర భుత్వ సివిల్ ఆసుపత్రిలో 14ఏళ్లలోపు బాలిక లకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం వేసి న టీకా కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాఽధికారులతో పాటు అమ్రాబాద్ సర్పంచ్ చిగుళ్ల కోటయ్య పాల్గొన్నారు. ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ మ ణి ప్రకాశ్, మన్ననూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి
ఉప్పునుంతల, (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్ త ప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం ఉప్పునుంతల క మ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన హెచ్‌పీవీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 14ఏళ్ల బాలికలకు ఉచి తంగా టీకాలు వేసినట్లతే క్యాన్సర్ కారక వైర స్ నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసి న కేక్ కట్ చేసి మహిళ డాక్టర్లకు శుభాకాంక్ష లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివా సులు, డీఎంహెచ్‌వో రవికుమార్, డీఐవో డాక్టర్ సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రజిత మల్లేష్, పార్టీ మండల అధ్యక్షుడు కట్ట అనం తరెడ్డి, ఫార్మాసిస్టు, వైద్యసిబ్బంది తదితరులు పా ల్గొన్నారు.