kumaram bheem asifabad- ఎరువులన్నీ యాప్‌తోనే..
ABN , Publish Date - Aug 05 , 2026 | 10:56 PM
ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందు కు మరో కొత్త యాప్‌ను రైతులకు కేంద్ర కసరత్తు చేస్తోంది. ఎరువుల పంపిణీని డిజిటలైజేషన్ చేసేందుకు గురువారం నుంచి సరికొత్త యాప్‌ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ రూప కల్పన చేస్తోంది. ఇప్పటి వరకు యూరియా కోసం వినియోగించిన ఫర్టిలైజర్ బుకింగ్ స్థానంలో ఇకపై ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) పేరిట యాప్ అమలులోకి తెస్తున్నారు
- ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ పేరుతో యాప్
- యూరియా తరహాలోనే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల సరఫరా
కాగజ్‌నగర్ టౌన్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందు కు మరో కొత్త యాప్‌ను రైతులకు కేంద్ర కసరత్తు చేస్తోంది. ఎరువుల పంపిణీని డిజిటలైజేషన్ చేసేందుకు గురువారం నుంచి సరికొత్త యాప్‌ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ రూప కల్పన చేస్తోంది. ఇప్పటి వరకు యూరియా కోసం వినియోగించిన ఫర్టిలైజర్ బుకింగ్ స్థానంలో ఇకపై ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) పేరిట యాప్ అమలులోకి తెస్తున్నారు. మరో కొత్త విధానం వస్తుండడంపై రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అధికారులు పేర్కొంటు న్నా రు. దీంతో అధికారులు ఇప్పటికే ఫర్టిలైజర్ డీలర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కాగజ్‌నగర్ మండలంలోని వంజిరిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట్ ఆధ్వర్యం లో ఏడీఏ మనోహర్, ఏవో రామక్రిష్ణ, ఏఈవోలు డీలర్లు, రైతులకు అవగాహన కల్పించగా, జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు మొదలు కాగా ఆయా మండలాలైన జైనూరు, కెరమెరి, ఆసిఫాబా ద్, కౌటాల, తదితర మండలాల్లో శ్రీకారం చుట్టారు. త్వరలోనే అందుబాటులోకి రానున్న కొత్త యాప్‌లో రైతులకు మరిన్ని సేవలు లబిస్తాయని అధికారులు చెబుతున్నారు.
- గతంలో యూరియా మాత్రమే..
గతంలో ఉన్న యాప్‌లో కేవలం యూరియాను మాత్రమే బుక్ చేసే వీలుండగా, కొత్త యాప్‌లో డీఏపీ, పొటాష్‌తో పాటు వివిధ రకాల కాంప్లెక్స్ ఎరువులను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పి స్తోంది. ఎరువుల కొరత లేకుండా స్టాకు వివరాలు తదితర అన్ని విషయాలు యాప్ ద్వారా తెలుస్తా యని దీంతో రైతు స్టాకు ఉన్న చోటకు వెళ్లి ఎరు వుల బస్తాలు తీసుకునేందుకు సులభంగా ఉంటుందన్నారు. అలాగే జిల్లాకు కూడా మరింత ఎరువులు వస్తాయని వాటిని సక్రమంగా అందించేందుకు యాప్ సులభంగా ఉంటుందని అధికారులు చెబు తున్నారు. రైతులు అన్ని రకాల ఎరువులు కొనుగోలు ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో యూరియా మాత్రమే యాప్ ద్వారా లభిస్తుండేది, అయితే ప్రస్తుత నూతన యాప్ ద్వారా డిఏపి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పంపిణీ అవుతుందని డీఏవో వెంకట్ తెలిపారు.
- జిల్లా4,52,202 ఎకరాల్లో..
జిల్లాలో ఈ సీజన్‌లో 4,52,202 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులో ఉంటాయని, పత్తి 3.70 లక్షల ఎకరాలు, వరి 42,228 ఎకరాలు, కంది 20,8 17, సోయాబీన్ పంట 1326 ఎకరాలు, మొక్కజొన్న 668 ఎకరాలు, ఇతర పంటలైన జొన్న, పెసర, మినుములు, మిరప, వేరు శనగ, ఆము దాలు, నువ్వులు 11, 254 ఎకరాలలో సాగు అవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే నూతనంగా అమలులోకి వచ్చే యాప్ ద్వారా ఎరువులు పొందాలంటే ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పని సరిగా ఉండాలి. ఈ నంబర్ ఆధారంగానే యాప్‌లో లాగిన్ కావాల్సి ఉంటుంది. లేదా ఆధార్ కార్డు నెంబర్‌తో లింకై ఉన్న మోబైల్‌తో కూడా చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఎరువుల బుకింగ్ కాదని అయితే పాత యాప్ ద్వారా ఎకరానికి 2 బస్తాలే ఇవ్వగా కొత్త యాప్‌లో మరికొన్ని బస్తాలు అదనంగా అందే వీలుందని అంటున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం..
- జిల్లా వ్యవసాయాధికారి, వెంకట్
కొత్త యాప్‌పై రైతులకు అవగాహన కల్పిస్తు న్నాం. పాత యాప్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొ త్త యాప్‌ను ఆగస్టు 6 నుంచి అమలులోకి తెస్తోం ది. ఇందులో యూరి యాతో పాటు ఇతర ఎరు వులు కూడా బుకింగ్ చేసుకోవచ్చు. యాప్ గురించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఆధార్ లింకయి ఉన్న మొబైల్ నంబర్ ఉంటే బుకింగ్ చేసుకోవచ్చు.