రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Nov 27 , 2026 | 10:42 PM
వరిధాన్యం కొ నుగోలు కేంద్రా ల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం లక్షెట్టిపేట మండ లం అంకత్‌పల్లి, ఇటిక్యాల గ్రామాల్లో జిల్లా అదనపు క లెక్టర్ రాములుతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చారు.
కలెక్టర్ కుమార్‌దీపక్
లక్షెట్టిపేట, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): వరిధాన్యం కొ నుగోలు కేంద్రా ల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం లక్షెట్టిపేట మండ లం అంకత్‌పల్లి, ఇటిక్యాల గ్రామాల్లో జిల్లా అదనపు క లెక్టర్ రాములుతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు ల సంక్షేమ కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకూడద నే ఉద్దేశ్యంతోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. రైతులు సైతం నాణ్యమైన ధాన్యం కేంద్రానికి తెచ్చి సహ క రించాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఏగ్రేడ్ ధాన్యం రూ.2461, బీ గ్రేడ్ రూ.2441 నిర్ణయించామన్నారు. సన్నరకా నికి రూ.ఐదు వందలు బోనస్ కూడా ఇస్తున్నామ న్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలిం చాలన్నారు. ఈకార్యక్రమంలో డీసీఎస్‌వో వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళ, తహసీల్దార్ దిలీప్‌కుమార్, సర్పంచ్ లింగం పల్లి లత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేష్, డైరెక్టర్ చందు పాల్గొన్నారు.