మెడికల్ బోర్డు వైపు చూపు...!
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:12 PM
సింగరేణిలో మెడికల్ బోర్డు పనరుద్ధరణపై కార్మిక కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నా యి. గత ఏడాది కాలంగా బోర్డు నిర్వహణ నిలిచిపోవడంతో అ నారోగ్యం భారిన పడిన కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నా రు.
-డిప్యూటీ సీఎం భట్టి హామీతో చిగురిస్తున్న ఆశలు
-ఏడాది తరువాత పునరుద్ధరణకు అడుగులు
-సన్నాహాలు చేస్తున్న సింగరేణి యాజమాన్యం
-ఎదురు చూస్తున్న కార్మిక కుటుంబాలు
మంచిర్యాల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో మెడికల్ బోర్డు పనరుద్ధరణపై కార్మిక కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నా యి. గత ఏడాది కాలంగా బోర్డు నిర్వహణ నిలిచిపోవడంతో అ నారోగ్యం భారిన పడిన కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నా రు. ఆరోగ్యం క్షీణించి, విధులు నిర్వహించలేని స్థితిలో ఉన్న కార్మి కులకు మెడికల్ బోర్డు నిర్వహణ ఊరటనిచ్చేది. అనారోగ్యం పాలై న కార్మికులు తాము విధులు నిర్వహించలేమని కోరుతూ యాజ మాన్యానికి దరఖాస్తు చేసుకుంటే మెడికల్ బోర్డు ద్వారా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, సదరు కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని సంస్థకు చెందిన వైద్యులు నిర్దారించేవారు. అలా విధులు నిర్వ హించలేని కార్మికులకు ఉద్యోగ విరమణ ఇచ్చి, వారి స్థానంలో డిపెండెంట్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించేది. అలా అనారోగ్యం పాలైన కార్మికుల కుటుంబాలకు మెడికల్ బోర్డు నిర్వహణ ద్వారా ఊరట లభించేది. అయితే సంవత్సర కాలంగా యాజమాన్యం మె డికల్ బోర్డు నిర్వహణ ఊసే ఎత్తకపోవడంతో డిపెండెంట్ ఉ ద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. మెడికల్ బోర్డు రద్దయిన కారణంగా అనారోగ్యంతో ఉండి, బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులను సైతం పరీక్షలకు పిలకపోవడంతో విధులు చేయలేని స్థితిలో ఉన్న వారి కుటుంబా లు ఆందోళన చెందుతున్నాయి. పైగా విధిలేని పరిస్థితుల్లో గైర్హాజ రు అయిన వారిపై యాజమాన్యం చర్యలు చేపట్టడం కార్మిక లో కాన్ని మరింతగా కుంగదీస్తోంది. గత సంవత్సరం మెడికల్ బోర్డు లో నెలకొన్న అవినీతి కారణంగా బాద్యులపై ఏసీబీ కేసులు నమో దు చేయడంతో బోర్డ్ నిర్వహణను యాజమాన్యం నిలిపివేసింది. మునిసిపల్ ఎన్నికల సమయంలో భూపాలపల్లి పర్యటన సంద ర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెడికల్ బోర్డును యథావిధిగా కొనసాగిస్తామని చెప్పడంతో కార్మికుల్లో ఆశలు చిగురించగా, యాజమాన్యం ప్రకటన కోసం వందలాది కార్మిక కుటుంబాలు ఆశతో ఎదురు చూస్తున్నాయి.
ఆందోళనలో డిపెండెంట్లు....
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన మెడికల్ బోర్డు నిర్వహణను యాజమాన్యం నిర్లక్ష్యం చేయడంతో దానిపై ఆధారపడ్డ డిపెండెంట్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సిం గరేణి వ్యాప్తంగా వందలాది మంది కార్మికులు మెడికల్ బోర్డు కో సం ఎదురు చూస్తున్నారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తే తాము అన్‌ఫిట్ అయి, తమ వారసులకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆశలో అనారోగ్యం పాలైన కార్మికులు ఉన్నారు. ఏడాది కాలంగా మెడికల్ బోర్డు కార్యకలాపాలు స్తంభించి పోవడంతో డిపెండెంట్ల వయస్సు ప్రమాణాల (ఏజ్ లిమిట్)పై ప్రభావం చూపుతుందనే ఆందోళన లు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, గతంలో నిర్వహించిన మెడికల్ బోర్డు ద్వారా మెడికల్ ఫిట్ అయి, కొత్తగా వారసత్వ ఉద్యోగాలు పొందిన డెపెండెంట్లు దాదాపు 300 మంది ట్రైనింగ్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ యాజమాన్యం వారికి పోస్టింగులు ఇవ్వలేదు. మెడికల్ బోర్డును రద్దు చేసిన యాజమాన్యం, దాని ద్వారా ఎంపి కైన యువతకు పోస్టింగ్ ఇవ్వని కారణంగా పదవీ విరమణ పొం దిన కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థికంగా ఇబ్బందులు, ఆందోళనకు గురికావలసిన పరిస్థితులు నెలకొన్నాయి.
డిప్యూటీ సీఎం హామీతో...
ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా సింగరేణిలో మెడికల్ బో ర్డును పునరుద్ధరిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా కార్మికులకు హామీ ఇచ్చారు. సింగరేణిలో కారుణ్య నియా మకాలకు ఎంపికైన 335 మందికి ఈ నెల 13న జిల్లా కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా నియామక పత్రాలు అంద జేశారు. ఈ సందర్భంగా మెడికల్ బోర్డును సైతం పునరుద్ధరి స్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. బోర్డులో ఎలాంటి అక్రమా లు, అవకతవకలకు చోటు లేకుండా ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా బోర్డు నిర్వహించనున్నట్లు హామీ ఇచ్చారు. మెడికల్ బోర్డు పునరుద్దరణతోపాటు మెడికల్ ఫిట్ పూర్తి చేసు కున్న డిపెండెంట్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చి, పోస్టింగులు ఇవ్వ నున్నట్లు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీంతో మెడికల్ బోర్డు నిర్వహణ వైపు అడుగులు పడుతుండగా, డిప్యూటీ సీఎం హామీతో కోల్‌బెల్ట్ వ్యాప్తంగా కార్మిక కుటుంబాల్లో ఆనందం వె ల్లివిరుస్తోంది. సంవత్సర కాలంగా పెండింగులో ఉన్న జఠిలమైన సమస్యకు పరిష్కారం లభించనుండటంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మెడికల్ బోర్డు ఏర్పాటుకు యాజ మాన్యం కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మిక కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.