Share News

అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలి

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:21 PM

కొల్లాపూర్‌ మండలంలో రాజకీయ పక్షపాతా న్ని వీడి అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇందిరమ్మ ఇళ్లుమంజూ రు చేయాలని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లే ని సుధాకర్‌రావు కోరారు.

అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలి
కొల్లాపూర్‌ ఎంపీడీవోకు సమస్యలు వివరిస్తున్న బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు

- బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు

కొల్లాపూర్‌/ పెంట్లవెల్లి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్‌ మండలంలో రాజకీయ పక్షపాతా న్ని వీడి అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇందిరమ్మ ఇళ్లుమంజూ రు చేయాలని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లే ని సుధాకర్‌రావు కోరారు. గురువా రం కొల్లాపూర్‌ ఎంపీడీవోను బీజేపీ నాయకులు కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఇందిరమ్మ ఇళ్ల్ల నిర్మాణం నత్తనడకన సాగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులను గుర్తించడంలో అధికారులు తీవ్ర పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త లకు మాత్రమే ఇళ్లు కేటాయిస్తూ, నిజమైన పే దలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొన్ని గ్రామాలకు కనీసం ఒక్కఇల్లు కూడా కేటా యించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శన మని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా నికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ. 5లక్షల్లో కేం ద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందనే నిజాన్ని పా లకులు, అధికారులు గుర్తుంచుకోవాలని తెలిపా రు. అనంతరం ఎంపీడీవో అడుసుమళ్లి వెంక ట్రావుకు వినతిపత్రం అందజేశారు.

ఫ పెంట్లవెల్లి ఎంపీడీవో కార్యాలయంలోనూ జూనియర్‌ అసిస్టెంట్‌ వెంకటస్వామికి బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు ఆ ధ్వర్యంలో పార్టీ నాయకులు వినతి పత్రం అం దజేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మం జూరు చేయాలని సుధాకర్‌రావు కోరారు. కొల్లా పూర్‌ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కేతూరి నారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్‌ గౌడ్‌, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మూలే భరత్‌చంద్ర, అసెంబ్లీ నియోజకవర్గకన్వీనర్‌ మే కల శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ సందు రమేష్‌, యన్మన్‌బెట్ల ఉప సర్పంచ్‌ రమే ష్‌ నాయక్‌, సీనియర్‌ నాయకులు గడ్డం శేఖర్‌ యాదవ్‌, శ్రీను నాయక్‌, ముక్కిడిగుండం ఉప సర్పంచ్‌ ఓరే శేఖర్‌, పెంట్లవెల్లి కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్యామలరెడ్డి, ప్రధాన కార్య దర్శి కొత్తపేట కురుమూర్తి, జిల్లా కౌన్సిల్‌ మెంబర్లు మూలే వెంకటేష్‌, మాధవస్వామి నగర్‌ సర్పంచు వెంకటస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 11:21 PM