Share News

kumaram bheem asifabad- ఏఐటీయూసీతోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:22 PM

ఏఐటీయూసీతోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం లభిస్తోందని యూనియన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. బుధవారం కైరిగూడ ఓపెన్‌కాస్టు, సీహెచ్‌పీ, జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గేట్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

kumaram bheem asifabad- ఏఐటీయూసీతోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం
మాట్లాడుతున్న ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య

రెబ్బెన, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏఐటీయూసీతోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం లభిస్తోందని యూనియన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. బుధవారం కైరిగూడ ఓపెన్‌కాస్టు, సీహెచ్‌పీ, జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గేట్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలను దశల వారిగా పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. డిప్యూటీజనరల్‌ సెక్రటరీ వీరభద్రయ్య మాట్లాడుతూ స్ట్రక్చర్‌ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై సింగరేణి అధికారుల దృష్టికి తీసుకరావటం జరిగినట్టు తెలిపారు. ప్రధానంగా దసరా పండుగకు ముందే కార్మికులకు లాభాల వాటా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. డిపెండెంట్ల సమస్యలకు పరిష్కారం లభించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. ఈ కార్యక్రమంలో గోలేటి బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌.తిరుపతి, పిట్‌ కార్యదర్శులు మారం శ్రీనివాస్‌, విజయ్‌కుమార్‌, రామయ్య, ఆశోక్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 11:22 PM