Air Balloon Festival: పరేడ్ గ్రౌండ్‌లో ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:27 AM
హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు.
రాంగోపాల్‌పేట్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఎండీ వల్లూరి క్రాంతి, తదితరులు పాల్గొన్నారు. సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఎయిర్ బెలూన్ ప్రదర్శన ఈ నెల 18 వరకు కొనసాగనుంది.