Share News

మజ్లిస్‌కు షాకిచ్చిన బెంగాల్‌ ఓటర్లు

ABN , Publish Date - May 05 , 2026 | 04:49 AM

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారి అడుగుపెట్టిన ఎంఐఎంకు నిరాశే మిగిలింది. పోటీ చేసిన 12 స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థుల...

మజ్లిస్‌కు షాకిచ్చిన బెంగాల్‌ ఓటర్లు

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారి అడుగుపెట్టిన ఎంఐఎంకు నిరాశే మిగిలింది. పోటీ చేసిన 12 స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 293 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో అమ్‌ జనతా ఉన్నాయున్‌ పార్టీ (హుమాయున్‌ కబీర్‌)తో కలిసి ఎంఐఎం బరిలోకి దిగింది. అయితే, బీజేపీ కోసమే బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో బాబ్రీ మసీదు నిర్మాణం చేపట్టి, ముస్లిం ఓట్లను చీల్చడానికి బీహార్‌ ఫార్మూలాను అమలు చేయనున్నట్లు హుమాయున్‌ కబీర్‌.. స్టింగ్‌ ఆపరేషన్‌లో ప్రకటించి, దొరికిపోవడంతో ఆ పార్టీతో ఎంఐఎం తెగతెంపులు చేసుకుంది. అయినా ఎంఐఎంను హుమాయున్‌ కబీర్‌ భాగ స్వామిగానే బెంగాల్‌ ఓటర్లు గుర్తించి... షాక్‌ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - May 05 , 2026 | 04:49 AM