ఎయిమ్స్ మార్గదర్శకం కావాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:14 AM
బీబీనగర్ ఎయిమ్స్ దక్షిణ భారతదేశానికి మార్గదర్శకం అమవుతుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షే మ శాఖ మంత్రి జగత్‌ప్రకాశ్ నడ్డా ఆకాంక్షించారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి జేపీ నడ్డా
బీబీనగర్, జూలై 9(ఆంధ్రజ్యోతి): బీబీనగర్ ఎయిమ్స్ దక్షిణ భారతదేశానికి మార్గదర్శకం అమవుతుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షే మ శాఖ మంత్రి జగత్‌ప్రకాశ్ నడ్డా ఆకాంక్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)ను కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డితో కలిసి గురువారం సందర్శించారు. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలను పరిశీలించారు. వైద్య విద్యార్థులు, ఎయిమ్స్ ఫ్యాకల్టీతో ప్రత్యేక సమావేశమై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎయిమ్స్ స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ సభ్యులు ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మ ణ్, ఎంపీ డీకే. అరుణ, ఎయిమ్స్ డైరెక్టర్ అమిత అగర్వాల్‌తో పాటు ఎయిమ్స్ ప్రధాన విభాగ అధిపతులతో స మావేశమై భవిష్యత్తు ప్రణాళిక, వైద్య విద్య, వైద్య సేవలు మౌలిక వసతి సౌకర్యాల కల్పన, ఆసుపత్రి భవన నిర్మాణాల ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎయిమ్స్ సంస్థలు ప్ర పంచస్థాయి ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తూ ప్రజా విశ్వాసాన్ని చూరగొంటున్నాయన్నారు. రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకే కాకుండా సమీప రాష్ర్టాల ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించే కేంద్రంగా బీబీనగర్ ఎయిమ్స్ నిలుస్తోందన్నారు. వైద్య సేవలు, వైద్య విద్య సీట్ల విస్తరణ పెరిగినప్పటికీ నాణ్యత విషయంలో రాజీపడబోమన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ భవన నిర్మాణాలు 87శాతం పూర్తయ్యాయని ఈ ఏడాది డిసెంబరు ఖల్లా పూర్తిచేసి పూర్తిస్థాయిలో ఎయిమ్స్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. 2022లో ఓపీ సేవలు మొదలు పెట్టగా గడిచిన నాలుగేళ్లలో రోజుకు 1800 మందికి ఓపీ సేవలు అందించే స్థాయికి చేరుకుందన్నారు. లక్షా 56వేల మందికి ఐపీ సేవలు అందించినట్లు వివరించారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా ఏడు ఎ యిమ్స్ సంస్థలకు విస్తరించగా, 2014 తర్వాత నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎయిమ్స్ సంస్థల విస్తరణ 7 నుంచి 23కు పెరిగిందన్నారు. అందులో 18సంస్థలు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. అంతకుముందు కేంద్రమంత్రులు నడ్డా, కిషన్‌రెడ్డిలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, గూడూరు నారాయ ణరెడ్డి, ఊట్కూరి అశోక్‌గౌడ్ స్వాగతం పలికారు. కేంద్రమంత్రులకు స్వా గతం పలికేందుకు ఎంపీతో పాటు ఆసుపత్రి అధిపతులు వేచి ఉండగా, అదే ప్రదేశానికి మీడియా ప్రతినిధులు, బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకున్నారు. జేపీ నడ్డా రాగానే ఆయనతో పాటు లోపలికి వెళ్లేందుకు పార్టీ శ్రేణులు ఫొటోలు, విజువల్స్ చిత్రీకరించేందుకు మీడియా ప్రతినిధులు దూసుకురావడంతో అక్కడున్న పూలకుండిలు ధ్వంసమయ్యాయి.