Share News

ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీలో శిక్షణ

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:46 AM

ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీలో అత్యాధునిక శిక్షణ కోసం ఏఐజీ హాస్పిటల్స్‌తో టెరుమో ఇండియా సంస్థ బుధవారం అవగాహన ఒప్పందం చేసుకుంది.

ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీలో శిక్షణ

  • ఏఐజీతో టెరుమో ఇండియా ఒప్పందం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీలో అత్యాధునిక శిక్షణ కోసం ఏఐజీ హాస్పిటల్స్‌తో టెరుమో ఇండియా సంస్థ బుధవారం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు కానుంది. ఏఐజీ నిర్మాణాత్మక శిక్షణ అందించనుంది. వాస్క్యులర్‌ వ్యాధులు, క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స అందించేలా డాక్టర్లను తీర్చిదిద్దాలన్నది తమ ప్రయత్నమని టెరుమో ఇండియా ఎండీ శిశిర్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. కనీస (తక్కువ) కోతతో చేసే చికిత్స ఫలితాలను మరింత మెరుగుపరచడమే లక్ష్యమని చెప్పారు. సర్జరీల తీరు ఇప్పుడు మారిందని, ఇమేజ్‌ గైడెడ్‌ థెరపీలు చికిత్స ఫలితాలను, జీవన నాణ్యతను కూడా మెరుగుపరుస్తున్నాయని ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. అయితే క్లీనిషియన్స్‌కు నైపుణ్యం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని, అందుకోసం ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 04:46 AM