Share News

ఉద్యోగాల మార్కెట్‌పై సునామీ లాంటిది ఏఐ

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:27 AM

కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశంతో ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలకు ముప్పు ఉందని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జియేవా చెప్పారు. ప్రారంభ స్థాయి ఉద్యోగాల విషయంలో...

ఉద్యోగాల మార్కెట్‌పై సునామీ లాంటిది ఏఐ

  • ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జియేవా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశంతో ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలకు ముప్పు ఉందని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జియేవా చెప్పారు. ప్రారంభ స్థాయి ఉద్యోగాల విషయంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఎన్డీటీవీతో మాట్లాడుతూ హెచ్చరించారు. ఈ టెక్నాలజీ మార్పును ‘‘లేబర్‌ మార్కెట్లను తాకిన సునామీ’’ అని అభివర్ణించారు. అభివృద్ధి చెందిన దేశాల విషయంలో ఉద్యోగాల కోత 60 శాతం వరకూ కూడా పెరగవచ్చని, భారత్‌లో 26 శాతం వద్ద ఆగిపోవచ్చని ఐఎంఎఫ్‌ అధ్యయనాలను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ‘‘ఎవరు దీనిలో నలిగిపోతారు? మన ఆందోళన అంతా ఎంట్రీ లెవెల్‌ జాబ్స్‌ గురించే. ఈ స్థాయిలోని ఉద్యోగాలను సులువుగా ఆటోమేషన్‌ చేయవచ్చు. అంటే యువ గ్రాడ్యుయేట్లు ఏ రకమైన జాబ్‌ను ఎంచుకోవాలి? ఏఐతో వస్తున్న మార్పులకు అనుగుణంగా విధానాలను రూపకల్పన చేసి ప్రజలను సిద్ధం చేయడంలో మనం వెనకబడి ఉన్నాం’’ అని జార్జియేవా చెప్పారు.

Updated Date - Feb 21 , 2026 | 03:27 AM