విద్యార్థులకు ఏఐ పాఠాలు
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:05 PM
కాలా నుగుణంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో రెండేళ్ల కిందట ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ(ఏఐ)పై అవగాహన కల్పించేం దుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన పాఠశాలలకు కంప్యూటర్లు సైతం అందజేసి ల్యాబ్‌లు నెలకొల్పారు. కొంతకాలం ప్రాథమిక స్థాయి పిల్లలకు కంప్యూటర్ అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో బోధన చేపట్టారు.
ప్రతి రెండు బడులకు ఒకరి చొప్పున నియామకం చేపట్టాలని ఆదేశాలు
జిల్లాలో 70 పాఠశాలలు ఎంపిక
బెజ్జూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కాలా నుగుణంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో రెండేళ్ల కిందట ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ(ఏఐ)పై అవగాహన కల్పించేం దుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన పాఠశాలలకు కంప్యూటర్లు సైతం అందజేసి ల్యాబ్‌లు నెలకొల్పారు. కొంతకాలం ప్రాథమిక స్థాయి పిల్లలకు కంప్యూటర్ అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో బోధన చేపట్టారు. పూర్తిస్థాయిలో బోధకులు లేకపో వడంతో అవి నిరుపయోగంగా మారాయి. జూన్29న వాటిపై రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ సమావేశం నిర్వహిం చారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధనను బలోపేతం చేయడం, విద్యార్థులకు కంప్యూటర్ బోధన అందించడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు.
అవుట్ సోర్సింగ్ పద్ధతిలో..
కంప్యూటర్ బోధకులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఏజెన్సీల ద్వారా ఏసీటీ-ఇన్‌స్ట్రక్టర్ నియామకం చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లో రెగ్యులర్ డిగ్రీతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో పీజీడీసీఏ చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాదాన్యం ఉంటుంది. ప్రతి రెండు పాఠశాలలకు ఒక ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించాలని సూచించారు. ఈ నెల 22లోగా పాఠశాలల్లో చేరేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు.
35మందికి అవకాశం..
జిల్లాలో 70పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రతి రెండు పాఠశాలలకు ఒక బోధకుని చొప్పున మొత్తం 35మందిని నియమించను న్నారు. వారు బోధించేందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు తక్కువ దూరం కలిగిన రెండు బడులను కలిపి మ్యాపింగ్ చేయనున్నారు. కంప్యూటర్ బోధనకు వీలుగా అవసరమైన సామగ్రిని సమకూర్చాల్సి ఉంటుంది. పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక ఇన్‌చార్జి అధికారిని ఏర్పాటు చేయాలి. ఇన్‌స్ట్రక్టర్లు శిక్షణ పూర్తి చేసుకొని వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య, విద్యార్థులకు ఆధునిక సమాచార సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందు కు వెళ్తోంది.