Share News

kumaram bheem asifabad- రైతన్నకు ఏఐ సలహాలు

ABN , Publish Date - Sep 27 , 2026 | 10:26 PM

మానవ మేధస్సుతో పోటీ పడుతున్న ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజేన్స్‌(ఏఐ) వ్యవసాయ రంగంలో రంగ ప్రవేశం చేసింది. యాంత్రీ కరణగా మారిన వ్యవసాయాన్ని మరింత అధునిక పుంతలు తొక్కిస్తూ సాంకేతికంగా ఏఐని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు భారత్‌ విస్తార్‌ యాప్‌ను అందించింది. యాప్‌ ద్వారా కేవలం సలహాలు, సూచనలు మాత్రమే కాకుండా విత్తనాలు, సాగు వద్ధతులు, చీడపీడల నివారణ, యాజమాన్య పద్దతులు, ధర ఎక్కడ లభిస్తుంది,

kumaram bheem asifabad- రైతన్నకు ఏఐ సలహాలు
లోగో

వాంకిడి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మానవ మేధస్సుతో పోటీ పడుతున్న ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజేన్స్‌(ఏఐ) వ్యవసాయ రంగంలో రంగ ప్రవేశం చేసింది. యాంత్రీ కరణగా మారిన వ్యవసాయాన్ని మరింత అధునిక పుంతలు తొక్కిస్తూ సాంకేతికంగా ఏఐని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు భారత్‌ విస్తార్‌ యాప్‌ను అందించింది. యాప్‌ ద్వారా కేవలం సలహాలు, సూచనలు మాత్రమే కాకుండా విత్తనాలు, సాగు వద్ధతులు, చీడపీడల నివారణ, యాజమాన్య పద్దతులు, ధర ఎక్కడ లభిస్తుంది, మార్కెట్‌ సౌకర్యాలు తదితర అంశాలపై సరైన అవగాహన కల్పిస్తుంది. కాగా పంపుసెట్లు, నిఘానెత్రాల నిర్వహణ, ఎరువులు, విత్తనాల కొనుగోలు, ఇతర అవసరాలకు రైతులు సెల్‌ ఫోన్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం విస్తార్‌ యాప్‌తో రైతన్నలు సెల్‌ఫోన్‌ని మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దుకొనే అవకాశం కలిగింది. ప్రాంతీయ భాషలో యాప్‌ సేవలు లభ్యమవుతడడం వారికి మరింత అనుకూలంగా మారింది.

- యాప్‌ సేవలు ఇలా..

రైతన్న తన పొలంలో నిలబడి తన పంటకు ఆశించిన చీడపీడ, తెగులు ఫోటో తీసి పంపిన వెంటనే ఆ రోగమేమిటి ? ఏ మందు వాడాలి ? ఎంత మోతాదులో వాడా లి ? తది తర వివరాలు క్షణాల్లో అందిస్తుంది. రైతు తాను సాగుచేయదల్చిన పంట వివరాలు అందిస్తే మేలైన విత్తనాలు ఎక్కడ లభిస్తాయి. ఎంత విత్తనం అవసరం అనే వివరాలందిస్తుంది. ఏ పంటనైనా దిగుబడి చేతికందిన తర్వాత ఏ మార్కెట్లో అమ్మితే లాభాలు వస్తాయో తెలియచే స్తుంది. ఏ కాలంలో ఏ పంట సాగు చేయా లో వాతావరణ పరిస్థితులు అంచనా వేసి నిర్ణయిస్తుంది. ఈదురు గాలులు, భారీ వర్షాలు, వడగండ్లు తదితర వాతావరణ సూచనలు అందించి పంట నష్టం కాకుండా కాపాడుతుంది. సారవంతమైన నేలలున్న జిల్లాలో ప్రధా నంగా పత్తి, వరి, మొక్క జొన్న, కంది పంటలతో పాటు వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతు లు ఈ విస్తార్‌ యాప్‌ను వినియోగించుకుంటే అధిక ప్రయోజనం పొందే అవకాశముంటుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Sep 27 , 2026 | 10:26 PM