Share News

ఏఐతో వేగంగా క్లినికల్‌ ప్రక్రియలు

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:19 AM

డ్రగ్‌ క్లినికల్స్‌కు సంబంధించి అసె్‌సమెంట్‌ ప్రక్రి యను ఏఐ ద్వారా ఆటోమేట్‌ చేయడం ద్వారా ట్రయల్స్‌ ప్రారంభానికి పట్టే సమయం 30 వారాల నుంచి 6 వారాలకు తగ్గిందని ఎలీ లిల్లీ సంస్థ ప్రతినిధి మనీశ్‌ అరోరా అన్నారు.

ఏఐతో వేగంగా క్లినికల్‌ ప్రక్రియలు

  • సేవల దశ నుంచి ఫలితాల వరకు జీసీసీలు.. దశాబ్ద కాలంలో పదివేలకు పైగా స్టార్ట్‌పల ఏర్పాటు

  • చర్చల్లో ప్రతినిధుల అభిప్రాయాలు

  • ఆవిష్కరణ కేంద్రాలుగా గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు

  • బయో ఆసియా సదస్సు-2026లో నిపుణుల వెల్లడి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): డ్రగ్‌ క్లినికల్స్‌కు సంబంధించి అసె్‌సమెంట్‌ ప్రక్రి యను ఏఐ ద్వారా ఆటోమేట్‌ చేయడం ద్వారా ట్రయల్స్‌ ప్రారంభానికి పట్టే సమయం 30 వారాల నుంచి 6 వారాలకు తగ్గిందని ఎలీ లిల్లీ సంస్థ ప్రతినిధి మనీశ్‌ అరోరా అన్నారు. దీని ద్వారా మందులు త్వరగా రోగులకు చేరుతున్నాయని తెలిపారు. బయో ఆసియా 2026 సదస్పులో రెండో రోజు నిర్వహించిన ‘మేకింగ్‌ ఇట్‌ మ్యాటర్‌: జీసీసీల సామర్థ్యం రోగిని ఏవిధంగా ప్రభావం చేస్తాయి’ అనే ప్యానెల్‌ చర్చలో ప్రముఖ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ ప్యానెల్‌లో వివరించారు. నోవో నార్డిస్క్‌ ప్రతినిధి ఆనంద్‌ జైన్‌ మాట్లాడుతూ.. ప్రారంభంలో ఫైనాన్స్‌, డేటా మేనేజ్‌మెంట్‌ వంటి చిన్న కార్యకలాపాలతో ప్రారంభమైన జీసీసీలు, నేడు పరిశోధన, మెడికల్‌ అఫైర్స్‌, గ్లోబల్‌ ఆపరేషన్లను నిర్వహించే స్థాయికి ఎదిగాయని తెలిపారు. కాగా, జీసీసీలు ప్రస్తుతం సేవల దశ నుంచి ఫలితాల దశలోకి ప్రవేశించాయని ఆస్ట్రాజెనెకా ప్రతినిధి శివకుమార్‌ తెలిపారు. మూడవ ప్యానెల్‌ ‘ఇండియా ఇన్నోవేషన్‌ మూమెంట్‌: స్కేలింగ్‌ ది నెక్స్‌ ్ట ఫేజ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఇంపాక్ట్‌’ చర్చలో భాగంగా భారత్‌ ఇన్నోవేషన్‌ రంగంలో వేగంగా ఎదుగుతున్నా ఫండింగ్‌, నైపుణ్యాల అభివృద్ధి, పరిశోధనలను మార్కెట్‌కు తీసుకురావడంలో ఇంకా వేగం అవసరమని నిపుణులు అన్నారు. నాల్గవ ప్యానెల్‌ ‘ఫైనాన్సింగ్‌ టెక్‌బయో, డీప్‌టెక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌’ చర్చలో భారత బయోటెక్‌ రంగం గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా ఎలా ఎదగాలనే అంశంపై పెట్టుబడిదారులు చర్చించారు.


ఏఐతో కొత్త ఔషధాల అన్వేషణ వేగవంతం

గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు వ్యూహాత్మక కేంద్రాలుగా మారుతున్నాయని బయో ఆసియా-2026 సదస్సులో నిపుణులు అన్నారు. ‘‘బిల్డింగ్‌ ఇన్నోవేషన్‌-ఫ్‌స్ట జీసీసీ, ఏఐ, ఆర్‌అండ్‌డి, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌’’ అనే అంశంపై జరిగిన చర్చలో వక్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్‌ పురవ్‌ గాంధీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎంఎ్‌సడీ చీఫ్‌ ఏఐ నిపుణుడు ఆంటన్‌ గ్రూమ్‌ మాట్లాడుతూ ఏఐని ఉపయోగించడం ద్వారా కొత్త ఔషధాల అన్వేషణ వేగవంతం అవుతుందన్నారు. నొవార్టిస్‌ సంస్థ మార్కెటింగ్‌ అధికారి గేల్‌ హార్వర్డ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన కొన్ని బృందాలు ఐఏ ఆధారిత కంటెంట్‌ ఇంజిన్లు, రియల్‌ టైం ఇన్‌సైట్స్‌ వేదికలను అభివృద్ధి చేస్తున్నాయన్నారు. టకెడా సంస్థకు చెందిన సంజయ్‌ పటేల్‌, ఒలింపస్‌ కార్పొరేషన్‌కు చెందిన సయీద్‌ నవీద్‌ మాట్లాడుతూ భారత్‌లో ఏఐ ఆధారిత ఇన్నోవేషన్‌ కేంద్రాలు వేగంగా విస్తరిస్తున్నాయన్నారు. అమెజాన్‌కు చెందిన సోమ్‌ చటోపాధ్యాయ్‌, యూనీ ల్యాబ్స్‌ గ్రూప్‌ సీఈవో బద్రి శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో ఉన్న డిజిటల్‌ నైపుణ్యం, సాంకేతిక మానవ వనరులు, గ్లోబల్‌ ఆవిష్కరణలకు ఉన్న అనుకూల వాతావరణం గురించి వివరించారు.

5 స్టార్ట్‌పలకు ఇన్నోవేషన్‌ అవార్డులు

బయో ఏసియా 2026 అవార్డుల కోసం 120కి పైగా స్టార్ట్‌పలను జ్యూరీ బృందం షార్ట్‌లిస్ట్‌ చేసిందని అధికారులు తెలిపారు. ఇందులో మెడ్‌టెక్‌, మెడికల్‌ డివైజెస్‌, బయోఫార్మా, సెల్‌్క్షజీన్‌ థెరపీ, ఏఐ్క్షఎంఎల్‌, న్యూట్రాస్యూటికల్స్‌ విభాగాల్లో 40కి పైగా నూతన స్టార్ట్‌పలు పోటీని ప్రదర్శించాయి. వాటిలో 5 వినూత్న స్టార్ట్‌పలు బయో ఆసియా 2026 ఇన్నోవేషన్‌ అవార్డులను అందుకున్నాయి. వీటిలో అచల సర్వీసెస్‌, ఎక్స్‌క్వింజ్‌ లైఫ్‌ సైన్సెస్‌, హెలెక్స్‌, నేచురల్‌ సొల్యూషన్స్‌, ఎన్మెట్రాస్యూటికల్స్‌ కంపెనీ, శ్రీ గురవే లైఫ్‌ సైన్సెస్‌ ఓపీసీ ఉన్నాయి.

Updated Date - Feb 19 , 2026 | 04:19 AM