నేనూ రైతు బిడ్డనే.. సేద్యం తర్వాతే ప్రజాసేవ
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:38 AM
వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు...
వ్యవసాయంలో పెనుమార్పులకు సర్కారు చర్యలు
రైతుబడి అగ్రిషోలో రాష్ట్ర వ్యవసాయమంత్రి తుమ్మల
కవాడిగూడ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని యువత కూడా ఐటీ రంగాన్ని వదిలి వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ స్టేడియంలో మూడు రోజులుగా కొనసాగుతున్న రైతు బడి అగ్రిషోను మంత్రి తుమ్మల ఆదివారం ముఖ్య అతిథిగా సందర్శించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను స్వయంగా పరిశీలించి.. సాంకేతికత, అధునాతన పరికరాలతో ఎలా లాభసాటి వ్యవసాయం సాధ్యమవుతుందనే విషయాలను స్టాళ్ల యజమానులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ తానూ రైతు బిడ్డనేనని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలోకి భారీ సంఖ్యలో రైతులను ఏకతాటిపైకి తీసుకొచ్చిన రైతుబడి అగ్రి షో నిర్వాహకులను మంత్రి తుమ్మల అభినందించారు. 3 రోజులు జరిగిన అగ్రిషోకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా రైతులు తరలి వచ్చారు.