వీబీజీ రామ్‌జీపై దేశవ్యాప్త ఉద్యమం
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:41 AM
వీబీ జీ రామ్‌జీ(పేరు మార్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం)ను వ్యతిరేకిస్తూ జూలై 1న దేశవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రకటించింది.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రకటన
పాలమూరు, జూన్ 22(ఆంధ్రజ్యోతి): వీబీ జీ రామ్‌జీ(పేరు మార్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం)ను వ్యతిరేకిస్తూ జూలై 1న దేశవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రకటించింది. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న మహాసభల్లో జాతీయప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ తెలంగాణలో దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 25 నుంచి జూలై 25 వరకు దళిత, గిరిజన పేటల్లో పర్యటనలు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 10న జైల్‌భరో చేపడుతున్నట్లు తెలిపారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లి మాట్లాడుతూ భూమిలేని వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న రూ.12వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నాగయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆర్.వెంకట్రాములు, ఉపాధ్యక్షులుగా జాన్‌వెస్లీ, బి.ప్రసాద్, ఎం.ఆంజనేయులు, సైదులు, కనకయ్య, పి.అంజయ్య, నరసింహులు, లంకా రాఘవులు, సాంబశివ, సాధుల శ్రీనివాస్, పొన్నం వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా బి.పద్మ, ములకలపల్లి రాములు, నారి ఐలయ్య, ఆర్.శ్రీనివాస్, రాజ్యం వెంకటయ్య, కె.జగన్, ఎం.వెంకటయ్య, ఎం.గోపాల్, ఎర్ర శ్రీనివాస్, శశిధర్‌రెడ్డి, వెంకటయ్య సింగారపు రమేష్, సభ్యులుగా కడియాల మోహన్, జగన్, వి.నరసింహ, ఆంజనేయులుతో పాటు మరో 95 మందిని ఎన్నిక చేసినట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ప్రకటించారు.