25 వేల అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:24 AM
భారత సైన్యంలో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 1 వరకు దరఖాస్తుకు అవకాశం
అల్వాల్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): భారత సైన్యంలో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 2026-2027 సంవత్సరానికి సంబంధించి జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సోల్జర్ ఫార్మా, సోల్జర్ టెక్నికల్ వంటి పలు విభాగాల్లో 25 వేలకు పైగా పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏప్రిల్ 1 వరకు కొనసాగనుందని వెల్లడించారు. పోస్టును అనుసరించి టెన్త్ లేదా ఇంటర్ అర్హతలు కలిగి ఉండాలని.. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ్జౌజీుఽజీుఽఛీజ్చీుఽ్చటఝడ.ుఽజీఛి.జీుఽలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 22 ఏళ్లు ఉంటుందని.. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), రిక్రూట్‌మెంట్ ర్యాలీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను మూడు విడతలుగా నిర్వహిస్తారని వివరించారు.