Share News

నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే నట్టేట ముంచింది

ABN , Publish Date - Sep 03 , 2026 | 10:30 PM

నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే నట్టేట ముంచిందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ, మాజీ మంత్రి జీ వన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ పేర్కొ న్నారు.

నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే నట్టేట ముంచింది

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ జీవన్‌రెడ్డి

జైపూర్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే నట్టేట ముంచిందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ, మాజీ మంత్రి జీ వన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ పేర్కొ న్నారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ వెయ్యి రోజుల పా లనలో వ్యవసాయ విధ్వంసంపై రైతు సదస్సులో వారు పాల్గొని మాట్లా డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫ లమైందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 420 హా మీలను ఇచ్చి అమలు చేయడంలో అభాసు పాలైందన్నారు. కేవలం ప్రతి పక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుని తాత్సారం చేస్తూ కాలం వెళ్ల దీస్తు న్నారన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్‌ ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి గెలిచారని, అనంతరం నియోజకవర్గాన్ని పట్టించు కోకుం డా విదేశాలు తిరుగుతున్నారన్నారు. అనంతరం జీవన్‌రెడ్డి, బాల్క సుమ న్‌లను నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ ఎస్‌ మండల అధ్యక్షుడు అరవిందరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుండు తిరు పతి, క్యాతనపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ సంధ్యారాణి, బీఆర్‌ఎస్‌ మహిళ నా యకురాలు అత్తి సరోజ, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2026 | 10:31 PM