Share News

kumaram bheem asifabad- అనాథ పిల్లలపై వాత్సల్యం

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:23 PM

అనాథ చిన్నారులకు అండగా నిలిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్‌ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తున్నాయి. తల్లిదండ్రుల సంరక్షణలో లేని చిన్నారులు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుంటుబాలకు రక్షణ, భద్రత, ఆరోగ్యం, విద్యలో సురక్షితమైన వాతావరణం కల్పిస్తూ పోషణ, పునరావాసం, మానసిక వికాసానికి ఈ పథకం దోహదపడుతుంది.

kumaram bheem asifabad-  అనాథ పిల్లలపై వాత్సల్యం
లోగో

- 18 ఏళ్లలోపు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు

వాంకిడి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అనాథ చిన్నారులకు అండగా నిలిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్‌ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తున్నాయి. తల్లిదండ్రుల సంరక్షణలో లేని చిన్నారులు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుంటుబాలకు రక్షణ, భద్రత, ఆరోగ్యం, విద్యలో సురక్షితమైన వాతావరణం కల్పిస్తూ పోషణ, పునరావాసం, మానసిక వికాసానికి ఈ పథకం దోహదపడుతుంది. ఈ పథకం కింద నెలకు రూ. 4 వేల ఆర్థిక సాయం అందిస్తారు. పునరావాసం, సంరక్షణ లేని చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఎంతో ఉపయోగకరం. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వీటిని నేరుగా బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేస్తారు. ఏడాదికి రూ. 48వేలు అందుతాయి.

- దరఖాస్తు విధానం...

అర్హులైన చిన్నారులు జిలల్లా మహిళాభివృద్ది సంక్షేమశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పేరు, వయసు, సంరక్ష కులవివరాలు, కుటుంబ పరిస్థితులు పొందుపరచాలి. అర్హులైన చిన్నారుల పూర్తి వివరాలను దరఖాస్తులో పొందుపర్చిన తర్వాత జిల్లా సామాజిక కార్యకర్తలు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. సంబంధిత వివరాలపై సరైన ఆధారాలుంటేనే ఆర్థిక భుృతి చేకూరనుంది. 18 ఏళ్ల లోపు చిన్నారులు, తల్లిదండ్రులు కోల్నోయి సంరక్షణ లేని అనాధలు, నిరుపేద కుంటుంబానికి చెంది తల్లి లేదా తండ్రి కోల్పోయిన వారు, ప్రమాదకర పరిస్థితులను ఎదుక్కొంటున్న వాల కార్మికులు, వేధింపులు, దోరిడికి గురైన చిన్నారులను అర్హులుగా పరిగణలోకి తీసుకుంటారు.

- జతపరచాల్సిన పత్రాలు..

పాస్‌పోర్టు సైజు ఫొటోలు, చిన్నారుల జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుబ్యాంకు పాస్‌బుక్‌, ఆదాయ ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం పట్టణానికి చెందిన వారైతే వార్షికంగా రూ. 96వేలు మించరాదు. పల్లెల్లో రూ. 72 వేలు మించరాదు.

Updated Date - Aug 19 , 2026 | 11:23 PM