kumaram bheem asifabad- ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టాలి
ABN , Publish Date - Sep 30 , 2026 | 10:55 PM
ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టేందుకు అధికారులు తనిఖీలు చేపట్టి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని హోటళ్లు, బేకరీలు, గురుకుల పాఠశాలలు,
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టేందుకు అధికారులు తనిఖీలు చేపట్టి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని హోటళ్లు, బేకరీలు, గురుకుల పాఠశాలలు, వసతి గృహలలో తయారుచేసే ఆహరంలో కల్తీ వస్తువులను వినియోగించే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. హోటళ్లు, బేకరీలు, తినుబండరాల షాపులను ఆహార భద్రత అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కల్తీ వస్తువులను ఆహారంలో వినియోగించకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యాపారాల అనుమతులు, షాపుల రిజిస్ట్రేషన్లు పరిశీలించాలన్నారు. కల్తీ వస్తువులను వినియోగించే వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆహారం తయారీలో వినియోగించే ముడి పదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో సచ్చిదానందచారి, డీపీవో భిక్షపతి, ఫుడ్ సేఫ్టీ అధికారి వాసురావు, ఫుడ్ ఇన్స్‌పెక్టర్ మహేందర్, వైద్యాధికారులు పాల్గొన్నారు.