అమ్మకు అక్షరమాల ద్వారా వయోజన విద్యాభివృద్ధి
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:29 PM
ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్ష రమాల కార్యక్రమం ద్వారా వయోజన విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటు న్నామని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ పేర్కొన్నారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్
హాజీపూర్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్ష రమాల కార్యక్రమం ద్వారా వయోజన విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటు న్నామని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని రాపల్లి గ్రామంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జెడ్పీ సీఈవో గణపతితో కలిసి ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాలు దిద్ది చ దువు నేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని, 15 నుంచి 60 ఏళ్ల లోపు వారందరు చదువుకోవాలన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గు ర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రాలకు నిరక్షరా స్యులు ప్రతి ఒక్కరు రావడమే కాకుండా చదువు నేర్చుకుని వంద రోజుల్లో అక్షరాస్యులుగా తయారు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ డిస్టిక్ మే నేజర్ తిరుపతి, గ్రామ సర్పంచు మిట్టపల్లి రాంరెడ్డి, అక్షర కేంద్రం వలం టీర్లు శిరీష, శ్యామల, జేడీ రాంచందర్, ఏపీఎం వెంకటేష్, సీసీలు మోహన్, కృపవర్ణ, రాజమణి, తదితరులు పాల్గొన్నారు.