Share News

అమ్మకు అక్షరమాల ద్వారా వయోజన విద్యాభివృద్ధి

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:21 PM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్షరమాల ద్వారా వయోజక విద్య అభివృద్ధికి కృషి చేస్తోందని జిల్లా డిప్యూటీ ట్రైనీ కలెక్టర్‌ విలాయత్‌ ఆలీ అన్నారు.

 అమ్మకు అక్షరమాల ద్వారా వయోజన విద్యాభివృద్ధి

గుడిరేవులో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌

ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ విలాయత్‌ ఆలీ

దండేపల్లి జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్షరమాల ద్వారా వయోజక విద్య అభివృద్ధికి కృషి చేస్తోందని జిల్లా డిప్యూటీ ట్రైనీ కలెక్టర్‌ విలాయత్‌ ఆలీ అన్నారు. మంగళవారం మండలంలోని గుడిరేవులో ఉల్లాస్‌ అక్షరాస్యత కేంద్రాలను జిల్లా వయోజన విద్యాధికారి అజ్మీర పురుషోత్తంనాయక్‌, మండల ప్రత్యేకాధికారి దుర్గప్రసాద్‌, జిల్లా సంక్షేమ శాక అధికారి రౌప్‌ఖాన్‌లతో కలిసి వయోజన విద్యా కేంద్రాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ నిర్లక్షరాస్యులను అక్షరాస్యులు

గా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలన్నారు. అక్షరాలలు దిద్ది చదువు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేద

ని, 15 ఏళ్లు నుంచి 60ఏళ్లు వరకులోపు వారందరు చదువురాని వారు చదువుకోవాలన్నారు. చదువుకునే వారికే సమాజంలో మంచి గౌరవ ఉంటుందన్నారు. జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తమనాయక్‌ మాట్లాడుతూ ఉల్లాస్‌ పథఽకం ద్వారా చదువురాని వారికి అక్షరాస్యత కేంద్రాలకు నిర్లక్షరాస్యులను ప్రతి ఒక్కరూ రావడమే కాకుండా చదువు నేర్చుకోకుని 100రోజుల్లో అక్షరాస్యులుగా తయారు కావాలని సూచించారు. అనంతరం వియోజనల

తో కలిసి సమావేశం నిర్వహించి నిర్లక్షరాస్యులు అక్షరాస్యులుగా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలన్నారు. ఈకార్య

క్రమాని విజయవంతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కళావతి, కార్యక్రమ సమన్వకర్త పాఠశాల హెచ్‌ఎం బోలిశెట్టి బు

చ్చన్న జిల్లా విద్య క్వావాటి ఎడ్యుకేషన్‌ అదికారి సత్యనారాయణమూర్తి, ఎంఆర్‌పి కోండు జనార్థన్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:21 PM