ఎప్‌సెట్-ఎంపీసీ అభ్యర్థులకు బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల్లో ప్రవేశాలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 04:28 AM
ఎప్‌సెట్-ఎంపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు బీ-ఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ఈ కోర్సుల్లో చేరే అభ్యర్థులు సెప్టెంబరు 3, 4 తేదీల్లో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎప్‌సెట్-ఎంపీసీ అభ్యర్థులకు
బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల్లో ప్రవేశాలు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 26 (ఆంధ్ర జ్యోతి): ఎప్‌సెట్-ఎంపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు బీ-ఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ఈ కోర్సుల్లో చేరే అభ్యర్థులు సెప్టెంబరు 3, 4 తేదీల్లో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 6వ తేదీ లోపు సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు వచ్చేనెల ఏడో తేదీలోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి.. 8వ తేదీ లోపు తమకు కేటాయిచిన కళాశాలల్లో స్వయంగా నివేదించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరిన అభ్యర్థులు.. ప్రస్తుత ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులు కాదని స్పష్టం చేశారు.