Share News

kumaram bheem asifabad- హక్కుల సాధనకు ఆదివాసీలు ఐక్యత చాటాలి

ABN , Publish Date - Nov 24 , 2026 | 10:51 PM

ఆదివాసీల రాజ్యాంగ బద్ధమైన హక్కులు, ఆస్తిత్వం, రిజర్వేషన్ల సరి రక్షణయే ఽలక్ష్యంగా ఆదివాసీల హక్కుల పోరాట సమితి( తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో డిసెంబరు 9న నిర్వహంచనున్న చలో హైదరాబాద్‌ మహాసభకు ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఐక్యత చాటాలని తరలిరావాలని దబోలి రాయిసెంటర్‌ సార్మేడి కుంర దుందేరావ్‌ పిలుపునిచ్చారు. మండలంలోని డబోలితో పాటు రాసిమెట్ట గ్రామాల్లో మంగళవారం రాయి సెంటర్‌ సభ్యులతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

kumaram bheem asifabad- హక్కుల సాధనకు ఆదివాసీలు ఐక్యత చాటాలి
మాట్లాడుతున్న సార్మేడి దుందేరావ్‌, పాల్గొన్న సభ్యులు

జైనూర్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల రాజ్యాంగ బద్ధమైన హక్కులు, ఆస్తిత్వం, రిజర్వేషన్ల సరి రక్షణయే ఽలక్ష్యంగా ఆదివాసీల హక్కుల పోరాట సమితి( తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో డిసెంబరు 9న నిర్వహంచనున్న చలో హైదరాబాద్‌ మహాసభకు ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఐక్యత చాటాలని తరలిరావాలని దబోలి రాయిసెంటర్‌ సార్మేడి కుంర దుందేరావ్‌ పిలుపునిచ్చారు. మండలంలోని డబోలితో పాటు రాసిమెట్ట గ్రామాల్లో మంగళవారం రాయి సెంటర్‌ సభ్యులతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. చలో హైదరాబాద్‌ కార్యక్రమంలో ఏజెన్సీలోని లింగాపూర్‌, సిర్పూర్‌(యు), జైనూర్‌ తదితర మండలాల నుంచి విద్యావంతులు, యువకులు, యువతులు వేలాదిగా తరలిరావాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు నీరు, అడవి, భూమిపౖ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు లక్ష్యంగా ఉద్యమ బాట పట్టాలని ఆయన కోరారు. డిసెంబర్‌ 9న లక్షల మంది ఆదివాసీలు విల్లుంబలతో హైదరాబాద్‌కు తరలి వచ్చి తమ ఐక్యతను, హక్కుల పరిరక్షణపై ఉన్న నిబద్ధతను చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివాసీ గూడెం నుంచి స్వఛ్ఛందంగా తరలివచ్చి చలో హైదరాబాద్‌లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో దబోలి మాజీ సర్పంచ్‌ మేస్రాం నాగోరావ్‌,చ మారు, అర్జున్‌, జ్యోతిరాం, మక్కు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2026 | 11:10 PM