kumaram bheem asifabad- తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:22 PM
తేనెటీగల పెంపకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని హంబుల్ బి సంస్థ ప్రతినిధి ప్రభాకర్ సూచించారు. మండలంలో సర్కెపల్లి గ్రామంలో శనివారం తేనెటీగల పెంపకంపై స్వయం సహాయ సంఘ సభ్యులకు, రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక రైతుకు 10 బాక్సులు అందించామని చెప్పారు. ఒక బాక్స్‌లో కనీసం 5 నుండి 7 కిలోల తేనె వస్తుందని తెలిపారు
వాంకిడి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): తేనెటీగల పెంపకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని హంబుల్ బి సంస్థ ప్రతినిధి ప్రభాకర్ సూచించారు. మండలంలో సర్కెపల్లి గ్రామంలో శనివారం తేనెటీగల పెంపకంపై స్వయం సహాయ సంఘ సభ్యులకు, రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక రైతుకు 10 బాక్సులు అందించామని చెప్పారు. ఒక బాక్స్‌లో కనీసం 5 నుండి 7 కిలోల తేనె వస్తుందని తెలిపారు. ఆరు నెలలకోసారి తేనెను తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. 10 బాక్సులలో ఆరు నెలలకు 50 కిలోల తేనె వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏడాదికి ఒక క్వింటాల్ తేనె సేకరించి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. తేనెటిగాల పెంపకం వల్ల వచ్చే లాభాలు, తేనె తీయడం, సేక రించిన తేనెను ఎలా, ఎక్కడ విక్రయించాలి అనే వివరాలను సభ్యులకు ఈ సందర్భంగా సూచించారు. తేనెటీగల పెంపకాన్ని రైతులు, సంఘ సభ్యులు సద్విని యోగం చేసుకోని ఆర్థింకంగా బలపడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఐకేపీ సీసీ బీంరావు, వీవోఏ అంబారావు, స్వయం సహాయక సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.