kumaram bheem asifabad-అదనపు కలెక్టర్ సేవలు ప్రశంసనీయం
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:16 PM
అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారిగా పని చేసిన దీపక్ తివారి సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో వికారాబాద్ కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్న అదనపు కలెక్టర్ దీపక్ తివారికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఆసిఫాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారిగా పని చేసిన దీపక్ తివారి సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో వికారాబాద్ కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్న అదనపు కలెక్టర్ దీపక్ తివారికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అదనపు కలెక్టర్‌గా దీపక్ తివారి రెండు సంవత్సరాల 8 నెలల పాటు సుదీర్ఘకాలంగా జిల్లాలో పని చేసి జిల్లా అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు., ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారిగా విద్యారంగం అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నారని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారని, ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాన్నారు. అధికారులను సమన్వయం చేసుకొని జిల్లా అభివృద్ధి నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేశారని తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్తున్న దీపక్ తివారి మాట్లాడుతూ జిల్లాలో అదనపు కలెక్టర్‌గా, ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారిగా పని చేసిన కాలంలో అధికారుల సహాయ సహకారాలు ఎంతో లభించాయని చెప్పారు. అధికారుల సమన్వయంతో శాసన సభ, పార్లమెంట్, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా అధికారులు, విద్యాధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.