Share News

విద్యార్థినిగా మారిన అదనపు కలెక్టర్‌

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:37 PM

అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) అశ్విని తానాజీ వాఖడే విద్యార్థులతో కూర్చుని ఉపాద్యాయులు చెప్పే పాఠాలను విన్నారు.

విద్యార్థినిగా మారిన అదనపు కలెక్టర్‌
సైదాపూర్‌ కేజీబీవీలో విద్యార్థుల మధ్య కూర్చుని పాఠాలు వింటున్న అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే

సైదాపూర్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) అశ్విని తానాజీ వాఖడే విద్యార్థులతో కూర్చుని ఉపాద్యాయులు చెప్పే పాఠాలను విన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే సైదాపూర్‌ మండలంలోని ఆకునూర్‌ కేజీబీవీని సందర్శించారు. పాఠశాలకు డిఎంఎఫ్‌టీ కింద మంజూరైన అదనపు తరగతి గదులు, నాబార్డ్‌ కింద మంజూరైన డార్మెటరీ పనులను, పనుల ప్రగతిని పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. తరగతి గదులను సందర్శించారు. విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చుని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విన్నారు. బోధన-అభ్యసన ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఎలబోతారంలో నిర్మించిన ఓపెన్‌ జిమ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ అశోక్‌, విద్యాధికారి కట్టా రవీంద్రచారి పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 11:37 PM