Share News

కేటీఆర్‌.. పిచ్చిమాటలు మానుకో: అద్దంకి

ABN , Publish Date - May 23 , 2026 | 05:26 AM

కేటీఆర్‌ తన దిగజారుడు, పిచ్చి మాటలను మానుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ హెచ్చరించారు.

కేటీఆర్‌.. పిచ్చిమాటలు మానుకో: అద్దంకి

న్యూఢిల్లీ, మే 22 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌ తన దిగజారుడు, పిచ్చి మాటలను మానుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ హెచ్చరించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్‌.. ఒక మైనర్‌ బాలిక అంశాన్ని పట్టుకుని నీచమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ అవినీతి అక్రమాల చిట్టా అంతా కేంద్రం వద్ద ఉండడం వల్లే వారు బీజేపీకి సరెండర్‌ అయ్యారని, పొత్తును వ్యతిరేకించినందుకే కవితను పక్కనబెట్టారని ఆరోపించారు. హరీశ్‌రావు ప్రస్తుతం బీజేపీతో టచ్‌లో ఉన్నారని, అందుకే గతంలో ఆయన ఢిల్లీ వెళ్లిన వ్యవహారంపై ఇప్పటికీ స్పందించడం లేదని పేర్కొన్నారు.

Updated Date - May 23 , 2026 | 05:26 AM