అస్తిత్వం కోసం కేటీఆర్, హరీశ్ అబద్ధాలు: అద్దంకి
ABN , Publish Date - May 02 , 2026 | 05:20 AM
కేటీఆర్, హరీశ్‌రావు అస్తిత్వం కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. రోడ్లు, భవనాల శాఖలో ...
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్, హరీశ్‌రావు అస్తిత్వం కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. రోడ్లు, భవనాల శాఖలో టెండర్ల ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. మేడే రోజున కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడాల్సిన కేటీఆర్.. అది వదిలేసి సీఎం రేవంత్‌పై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసిందో ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. ఇటీవలే గిగ్ వర్కర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిన విషయం ఆయనకు తెలియదా అని ఓ ప్రకటనలో నిలదీశారు.