రేవంత్ ముందు హరీశ్ బ్లాక్‌మెయిల్ నిలవదు
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:16 AM
హరీశ్.. ఓ బ్లాక్‌మెయిల్ రావ్ అని.. సీఎం రేవంత్‌రెడ్డి ముందు ఆయన దందాలు చెల్లవని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.
భూ కేటాయింపులపై విచారణకు సిద్దమా?: అద్దంకి
హైదరాబాద్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): హరీశ్.. ఓ బ్లాక్‌మెయిల్ రావ్ అని.. సీఎం రేవంత్‌రెడ్డి ముందు ఆయన దందాలు చెల్లవని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఉద్యమ సమయంలో పారిశ్రామికవేత్తలను బ్లాక్‌మెయుల్ చేసిన చరిత్ర హరీశ్‌రావుదన్నారు. సొంత మామ కేసీఆర్‌నూ బ్లాక్‌మెయిల్ చేసి బీఆర్‌ఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రి అయ్యారని ఆరోపించారు. నాదర్‌గుల్ భూములను 2021లోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ చేసిందని ఆరోపించారు. హరీశ్‌రావు తన అస్తిత్వం కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. 2014 నుంచి 2026 వరకు భూ కేటాయింపులు, బదలాయింపులపై విచారణకు ప్రభుత్వం సిద్ధమని, దీనికి హరీ్‌షరావు కూడా సిద్దమా అని సవాల్ విసిరారు.