బండి సంజయ్ సైకో జోకర్
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:53 AM
కేంద్రమంత్రి బండి సంజ య్ ఒక సైకో జోకర్‌గా మారాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు.
కింద పడ్డా తనదే పై చేయి అన్నట్లు కేటీఆర్: అద్దంకి
హైదరాబాద్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి బండి సంజ య్ ఒక సైకో జోకర్‌గా మారాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సహకారం తీసుకున్నా, బీజేపీకి సీట్లు రాలేదని శనివారం గాంధీ భవన్‌లో మీడియాకు చెప్పారు. సిరిసిల్లలో ప్రచారం చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కరీంనగర్‌లో ఎందుకు ప్రచారం చేయలేదని అద్దంకి ప్రశ్నించారు. మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు సీట్లు బాగా వచ్చాయని చెప్పుకుంటున్న కేటీఆర్.. కిందపడ్డా తనదే పై చేయి అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆరవింద్ అరగుండుపై ప్రజలు కొబ్బరికాయ కొట్టారన్నారు. బీఆర్‌ఎస్ గుమస్తా పత్రిక నమస్తే తెలంగాణలో రాతలను చూస్తే జాలేస్తోందన్న అద్దంకి.. ప్రజాతీర్పును వక్రీకరించి తప్పుడు రాతలు రాశారని, వారికి సిగ్గుండాలని విమర్శించారు.