Share News

క్రషర్‌ నిర్వాహకుల నుంచి హరీశ్‌రావుకు ముడుపులు: అద్దంకి

ABN , Publish Date - May 03 , 2026 | 04:21 AM

అసెంబ్లీలో క్రషర్ల అంశంపై మాట్లాడి వాటి యజమానులను బ్లాక్‌మెయిల్‌ చేసి వారి నుంచి ఎమ్మెల్సీ నవీన్‌రావు మధ్యవర్తిగా రూ.కోటి చొప్పున హరీశ్‌రావు వసూళ్లకు...

క్రషర్‌ నిర్వాహకుల నుంచి హరీశ్‌రావుకు ముడుపులు: అద్దంకి

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో క్రషర్ల అంశంపై మాట్లాడి వాటి యజమానులను బ్లాక్‌మెయిల్‌ చేసి వారి నుంచి ఎమ్మెల్సీ నవీన్‌రావు మధ్యవర్తిగా రూ.కోటి చొప్పున హరీశ్‌రావు వసూళ్లకు పాల్పడ్డారని ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ అన్నారు. హరీశ్‌కు దమ్ముంటే క్రషర్ల యజమానుల నుంచి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం సీఎల్పీ మీడియా సమావేశంలో అద్దంకి మాట్లాడారు. బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా, కేరాఫ్‌ అడ్ర్‌సగా హరీశ్‌రావు మారారని దుయ్యబట్టారు. హ్యామ్‌ రోడ్ల కాంట్రాక్టర్లను బెదిరిస్తూ అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రగతిభవన్‌, ఫాంహౌ్‌సలకే పరిమితమయ్యారని టీపీసీసీ జనరల్‌ సెక్రెటరీ గజ్జెల కాంతం విమర్శించారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ కుటుంబంలో ఒక్కరైనా ప్రాణత్యాగం చేశారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.లక్షల కోట్లు కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. కవిత ఒక పార్టీ పెట్టిందని, రేపు హరీశ్‌రావు మరో పార్టీ పెట్టబోతున్నారన్నారు.

Updated Date - May 03 , 2026 | 04:21 AM