బీఆర్‌ఎస్ నేతలపై కక్ష సాధింపులు
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:09 PM
రాష్ట్రంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులపై ప్రజా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది తప్ప ప్ర జలకు చేసిందేమి లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
మందమర్రిటౌన్(రామకృష్ణాపూర్), సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులపై ప్రజా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది తప్ప ప్ర జలకు చేసిందేమి లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆది వారం క్యాతనపల్లిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నూరులో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి త ప్పితే ఇప్పుడున్న ఎమ్మెల్యే చేసిందేమి లేదన్నారు. మంత్రి వివేక్‌వెంకటస్వామి స్థానికం గా ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు జపాన్ జర్మనీలో ఉ ద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడం ఏమిటో అర్ధం కావడం లేదన్నారు.
సింగరేణిలో స్కీములు లేవు స్కాంలే
మందమర్రిటౌన్ : సింగరేణి సంస్థలో కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఎలాంటి స్కీములు లేవని, అన్ని స్కాములేనని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఆదివారం రాత్రి స్థానిక సీఈఆర్ క్లబ్‌లో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సులో ఆ యన పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వంలో నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించామని, కారుణ్య నియమకాలు, ఇంక్రిమెంటు ఇచ్చామన్నారు. టీబీజీకేఎస్ అధ్య క్షుడు మిర్యాల రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంధ్యారాణి, నాయకులు పాల్గొన్నారు.