Share News

లొంగిపోయిన నటి ప్రత్యూష కేసు నిందితుడు

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:15 AM

సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష మరణం కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థ్‌రెడ్డి.. 24 ఏళ్ల తర్వాత మీడియా ఎదుటకు వచ్చాడు.

లొంగిపోయిన నటి ప్రత్యూష కేసు నిందితుడు

హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష మరణం కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థ్‌రెడ్డి.. 24 ఏళ్ల తర్వాత మీడియా ఎదుటకు వచ్చాడు. సుప్రీంకోర్టు తుది తీర్పు నేపథ్యంలో అతడు నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. నాలుగువారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్న అతడు నగరానికి వచ్చాడు. 2002లో తమ ప్రేమ వివాహాన్ని తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకుయత్నించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతిచెందిగా సిద్ధార్థరెడ్డి కోలుకుని డిశ్చార్జ్‌ అయిన విషయం తెలిసిందే.

Updated Date - Mar 17 , 2026 | 05:15 AM