Share News

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు జీవీఆర్ కన్నుమూత

ABN , Publish Date - Aug 27 , 2026 | 07:39 AM

ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. ఆయన మరణ వార్తను నటి కరాటే కల్యాణి సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు.

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు జీవీఆర్  కన్నుమూత
Actor Gv narayana rao

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. ఆయన మరణ వార్తను నటి కరాటే కల్యాణి సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. జీవీ 100కు పైగా చిత్రాల్లో నటించారు. 1976లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అంతులేని కథ’ సినిమాతో నటుడిగా వెండి తెరకు పరిచయయ్యారు.


నారాయణరావు నటించిన తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న నారాయణరావు.. స్టార్ హీరోలు రజనీకాంత్, చిరంజీవిలకు బెస్ట్ ఫ్రెండ్. ‘అంతులేని కథ’, ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, హిట్లర్ వంటి సినిమాల్లో జీవీ నటించారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, 'పెళ్ళినీకు శుభం నాకు' వంటి పలు సినిమాలను నిర్మాతగా వ్యవహరించారు. నారాయణరావు మృతిపై 'మా' అసోసియేషన్ సంతాపం తెలిపింది.

Updated Date - Aug 27 , 2026 | 07:49 AM