‘సర్’పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:37 PM
కొత్త ఓటర్ల నమో దు, తొలగింపులపై కార్యకర్తలు అ ప్రమత్తంగా ఉండాలని నాగర్‌క ర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనా ర్దన్‌రెడ్డి అన్నారు.
- నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
అచ్చంపేటటౌన్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : కొత్త ఓటర్ల నమో దు, తొలగింపులపై కార్యకర్తలు అ ప్రమత్తంగా ఉండాలని నాగర్‌క ర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనా ర్దన్‌రెడ్డి అన్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే సర్ కార్య క్రమాలపై బుధవారం పట్టణంలోని ఫంక్షన్ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. సర్ కార్యక్రమంలో ఓట రు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అం శాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. త్వ రలో డిజిటల్ పద్ధతిలో బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉన్నందున్న కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు మనోహర్, మాకం తిరుపతయ్య, మాజీ మునిసిపల్ చైర్మన్లునర్సిం హగౌడ్, తులసీరాం, నాయకులు పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
తిమ్మాజిపేట, (ఆంధ్రజ్యోతి) : మండల కేం ద్రానికి చెందిన వడ్ల చెన్నకేశవులు ఇటీవల బా విలో ఈతకువెళ్లి మృతి చెందాడు. బుధవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి బాధిత కు టుంబ సభ్యులను పరామర్శించారు. తనవంతు గా రూ.10000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ స భ్యులకు అందజేశారు. బీఆర్‌ఎస్ మండల అధ్య క్షుడు జోగుప్రదీప్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివా స్ యాదవ్, మాజీ సర్పంచ్ వేణుగోపాల్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్, పార్టీ నాయకులు స్వామి, ప్రశాంత్‌కుమార్, నర్వ రఘు, సైఫ్ సలావుద్దీన్, శివ పాల్గొన్నారు.