Share News

కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలి

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:53 PM

వచ్చే ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తే కేం ద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలోకి వస్తుందని అచ్చంపేట ఎమ్మె ల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.

కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలి
మాట్లాడుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

- అమ్రాబాద్‌లో పార్టీ ఆఫీసును ప్రారంభించిన ఎమ్మెల్యే

అచ్చంపేట/ అమ్రాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : వచ్చే ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తే కేం ద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలోకి వస్తుందని అచ్చంపేట ఎమ్మె ల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగ ళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా ప్రతీ ఒ క్కరు కలిసికట్టుగా పని చేయాలని పిలుపుని చ్చారు. అనంతరం మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్‌ మార్కెట్‌యార్డు సమీపంలో ఎమ్మెల్యే విశ్వ ప్రధాన ట్రస్టు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఎంఏ రహీం, అమ్రాబాద్‌ సర్పంచ్‌ చిగుళ్ల కోటయ్య, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చింతల రాజగోపాల్‌, గోలి మల్లేశ్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్‌ కే.గోపాల్‌, మండల విద్యాధికారి బాలకి షన్‌, ఎఫ్‌ఆర్‌వో వీరేష్‌, సంస్థ ప్రతినిధులు ప్ర కాశ్‌, దేవదాస్‌ సాగర్‌, కృష్ణ, రవి, రాజు, ప్ర సాద్‌, బాలకృష్ణ పాల్గొన్నారు.

పోచమ్మ దేవతకు పూజలు

అచ్చంపేటలోని భ్రమరాంబ దేవస్థానం ఆ ధ్వర్యంలో పోచమ్మ దేవత బోనాలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మె ల్యే డాక్టర్‌ వంశీకృష్ణ హాజరై బొడ్రాయికి నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పో చమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్య క్రమంలో పట్టణ ప్రముఖులు, సీనియర్‌ కాంగ్రె స్‌ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:53 PM