కార్యకర్తలే పార్టీకి పునాది
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:13 PM
కాంగ్రెస్ కార్య కర్తలే పార్టీకి పునాదిలాంటి వారని, కష్టపడ్డ వారికి తప్పని సరిగా పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు.
-రాష్ట్రం అప్పుల పాలైనా...సంక్షేమం అమలు చేస్తున్నాం
-రాబోయే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు ఖాయం
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
మంచిర్యాల, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ కార్య కర్తలే పార్టీకి పునాదిలాంటి వారని, కష్టపడ్డ వారికి తప్పని సరిగా పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమి టీ సర్వసభ్య సమావేశం శుక్రవారం క్యాతన్‌పల్లి మునిసిపా లిటీ పరిధిలోని ఎంఎన్‌ఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చే యగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇటీవల జరిగిన డి స్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) సభ్యుల ఎన్నికపట్ల అందరినీ సంప్రదించామన్నారు. అధికారంలో లేని సమయంలో కూ డా ప్రేంసాగర్‌రావు పార్టీ కోసం చాలా కష్టపడ్డారని కొని యాడారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రేంసాగర్‌రావుకు ఆశించిన మేర అవకాశం రాలేదని, భవిష్యత్తులో తప్పక వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కారణమన్నారు. కాంగ్రెస్ దేశంలో గొప్ప చరిత్ర ఉన్న పార్టీ అని, పీసీసీ అధ్యక్షుడిగా పని చేయాలని తాను ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా ఉన్నప్పుడే అనుకున్నానన్నారు. తనలా ప్రతీ ఒక్కరికీ అవకాశాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, సంక్షేమం అని, బీఆర్‌ఎస్ పదేళ్ల విధ్వం సకర పాలనతో పోలిస్తే ఎన్నో రెట్లు గొప్ప పనులు చేపడు తున్నామన్నారు. కాంగ్రెస్, టీడీపీ 65 ఏళ్ల పాలనలో చేయని అప్పులు బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలోనే ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. ఇంతజేసి, ఆ పార్టీ ప్రజా సంక్షేమానికి చేసిందేమీ లేదని, బీఆర్‌ఎస్ నాయకులు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని విమర్శిం చారు. వాళ్లు దోచుకున్న సొత్తు పంపకాల్లో తేడాలతోనే కేసీ ఆర్ కుటుంభంలో తగాదాలు జరుగుతున్నాయన్నారు. బీ ఆర్‌ఎస్ చేసిన ఎనిమిది లక్షల కోట్లకు నెలకు వడ్డీలు కడు తూనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అ మలు చేస్తున్నామన్నారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ దేశంలోనే బృహత్తర కార్యక్రమం అని, బీఆర్‌ఎస్ హయాంలో పేదలకు చెందాల్సిన బియ్యం కూడా స్మగ్లింగ్‌కు గురైందన్నారు. దేశం మొత్తం మీద సన్నబియ్యం పథకం ఎందుకు అమలు చేయడంలేదని మోదీ, బీజేపీని ప్రశ్నిం చారు. పొద్దున లేస్తే కులం, మతం, దేవుడు అంటారని, శ్రీరామచంద్రుడు బీజేపీ జాగీరా అని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఉన్న వి పీకేస్తోందని ఎద్దేవా చేశారు. కుల మతాలను రెచ్చగొట్టే పార్టీకి తెలంగాణలో అవకాశం లేదన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి, టూరిజం శాఖా మాత్యులు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సా కారం కావాలని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, దాన్ని గత ప్రభుత్వం కుటుంబ పాల నతో అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. వేలాది కోట్లు ఆ పార్టీ నాయకులు దుర్వినియోగం చేశారని, బీఆర్ ఎస్ సంపాధించిన అక్రమార్జనతో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను అవాస్తవాలుగా మార్చి త ప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేకానంద మాట్లాడు తూ రేవంత్ వచ్చిన తరువాత అనేక మంచి సంక్షేమ కార్య క్రమాలు అమలు చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని, లక్ష కోట్ల రూపాయలు వృధా అయ్యాయన్నారు. బీఆర్‌ఎస్ హ యాంలో సింగరేణి సంస్థకు చెందిన డీఎంఎఫ్‌టీ నిధులు జిల్లా అభివృద్ధికి కాకుండా సిద్దిపేట, గజ్వేల్‌లకు తరలి వె ళ్లాయని, ఈ మూడేళ్లలో నిధులు పూర్తిగా జిల్లాకే ఉపయో గపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ పా ర్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించాలన్నారు. పదవుల్లో వా రికి ప్రాధాన్యత ఇవ్వాలని, గడిచిన పదేళ్లలో కార్యకర్తలు పా ర్టీ కోసం శ్రమించారన్నారు. పార్టీ అభివృద్ధికి తనతోపాటు చాలా మంది కష్టాలు పడ్డామని, తమపై కేసులు పెట్టార న్నారు. పార్టీలో మొన్నటికి మొన్న వచ్చిన వాళ్లకు వేదికల పై పెద్దపీట వేస్తున్నారని, జెండాలు మోసిన వాళకు పదవు ల్లో సముచిత స్థానం కల్పించాలన్నారు. సమావేశానికి ముం దు పార్టీ జెండాను ఆవిష్కరించిన పీసీసీ అధ్యక్షుడు మహే ష్‌కుమార్ అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పదవులు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశా రు. డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్, పీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, సభ్యులు కొండా చంద్రశేఖర్, డాక్టర్ నీలకంఠేశ్వర్‌రావు, మంచిర్యాల కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు తూముల నరేష్, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జి రహమత్ హుస్సేన్, బెల్లంపల్లి మునిసిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.