సమస్యలు పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Apr 17 , 2026 | 01:33 AM
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా సమస్య లను తెలుసుకుని తొందరగానే పరిష్కరిస్తున్నామని మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. 28, 35 డివిజన్లలో గురువారం మేయర్ అధికారులతో కలిసి సందర్శించారు.
మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా సమస్య లను తెలుసుకుని తొందరగానే పరిష్కరిస్తున్నామని మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. 28, 35 డివిజన్లలో గురువారం మేయర్ అధికారులతో కలిసి సందర్శించారు. కార్యక్రమం ద్వారా చేపట్టిన ప నులను పరిశీలించారు. కాలనీల్లో పర్యటించి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రో డ్లు, డ్రైనేజీల పూడిక, సకాలంలో చెత్త తొలగింపు, వీధి దీపాలు ఏర్పాట్లు చేయాలని విన్నవించారు. స్థానికులు చెప్పిన సమస్యలను విని తొందరగానే పరిష్కారిస్తానని మేయర్ హామీ ఇచ్చారు. ఎమ్మె ల్యే ప్రేంసాగర్ రావు సహకారంతో డివిజన్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇంటి పరిసరాల ప్రాం తాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ స ల్లా రమ్య, 28,35 డివిజన్ల కార్పొరేటర్లు అమృత రాజ్ కుమార్, మర్రి శ్రీలత, అధికారులు, సింగరేణి అధికారులు, వార్డు ఆఫీసర్లు, డివిజన్‌లోని ప్రజలు పాల్గొన్నారు.