Share News

kumaram bheem asifabad-అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు

ABN , Publish Date - Jun 05 , 2026 | 10:27 PM

కొత్తసార్సాల వాగును పరిశీలించిన కుమరం భీం జిల్లా కలెక్టర్‌ కె హరిత

kumaram bheem asifabad-అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు
: అనుమతి పత్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ కె హరిత

కాగజ్‌నగర్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): సరైన అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత తెలిపారు. కాగజ్‌నగర్‌ మండలం కొత్తసార్సాల వాగును శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ల పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సరైన అనుమతులు లేకుండా ఇసుకను, మట్టిని తరలిస్తే చర్యలు తప్పవన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఇసుక వాహనం యాప్‌ ప్రారంభించామని చెప్పారు. ఇసుకను తరలించే వారు యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకొని అనుమతి పొందాలన్నారు. అక్రమంగా తరలించే వాటిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట అధికారులు ఉన్నారు.

బడిబాట కార్యక్రమంల విజయవంతం చేయాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 19 వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట క్యార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ కెహరిత అన్నారు. కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలసి బడిబాట కార్యక్రమం నిర్వహణపై శుక్రవారం అన్ని ప్రభుత్వ యజమాన్యాల పాఠశాలల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని చెప్పారు. పాఠశాలలను విద్యార్థుల నమోదు 100 శాతం ఉండాలని తెలిపారు. ఆ దిశగా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని తెలిపారు. అంగన్‌వాడీలలో ఉన్న విద్యార్థి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉండాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలో ఉన్న విద్యార్థులు ప్రాథమికోన్నత పాఠశాలలకు ఉండాలని, అక్కడ ఉన్న విద్యార్థులు ఉన్నత పాఠశాలలకు వెళ్లాలని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరేలా పర్యవేక్షించాలని తెలిపారు. ఏ విద్యార్థి బడి బయట ఉండకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివే విద్యార్థులకు పాఠశాల ప్రారంభమైన రోజునే పాఠ్య పుస్తకాలు, వర్క్‌ పుస్తకాలు, ఏక రూప దుస్తులు, అల్బాహారం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించనున్నామని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. బడిబాట కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములను చేయాలని తెలిపారు. సమావేశంలో డీఈవో సచ్చిదానంద, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి నదీమ్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారి ఉమర్‌ హుస్సేన్‌, తదితరులు పాల్గొన్నారు.

పబ్లిక్‌ స్కూల్‌ ప్రవేశానికి లక్కీడ్రా

హౖదరాబాద్‌ బేగంపేటలోని పబ్లిక్‌ స్కూల్‌లో ఒకటో తరగతిలో ప్రవేశానికి గాను శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ కె హరిత లక్కీడ్రా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 12 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన పది దరఖాస్తుల్లో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. దుప్త అనిరుద్‌జాయ్‌ ఎంపికయ్యాడు. వెయిటింగ్‌ లిస్టులో డోంగ్రే హన్ష్‌వచన్‌, దగమ శ్రినిష్‌ను ఎంపిక చేశారు.

Updated Date - Jun 05 , 2026 | 10:27 PM