Share News

kumaram bheem asifabad- సమయపాలన పాటించకుంటే చర్యలు

ABN , Publish Date - Feb 05 , 2026 | 10:22 PM

విధులపై సమయపాలన పాటించకుంటే అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అబ్కారి, మద్యనిషేద, పౌర సరఫరాలు, వ్యవసాయ, భూగర్భజల, మత్స్య, వైద్య ఆరోగ్య, విద్య, భూ కొలతల శాఖ కార్యాలయాలను తనిఖీ చేశారు.

kumaram bheem asifabad-  సమయపాలన పాటించకుంటే చర్యలు
కలెక్టరేట్‌లో కార్యాలయాలను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): విధులపై సమయపాలన పాటించకుంటే అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అబ్కారి, మద్యనిషేద, పౌర సరఫరాలు, వ్యవసాయ, భూగర్భజల, మత్స్య, వైద్య ఆరోగ్య, విద్య, భూ కొలతల శాఖ కార్యాలయాలను తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది హాజరు పట్టికలను చూసి గైర్హాజరు అయిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొంత మంది డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారని అధికారులు వివరించారు. హాజరైన అధికారులు రిజిస్టర్‌ సంతకం చేయక పోవడాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు సకాలంలో అందాలంటే అధికారులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని అన్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని తెలిపారు. మరో సారి సమయానికి విధులకు హాజరు కాని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఐఎఫ్‌ఎస్‌ అధికారి భార్గవ్‌కుమార్‌, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో బినామీ ఉద్యోగి..

కాగా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ల్యాండ్‌ అండ్‌ సర్వే డిపార్టుమెం ట్‌లో ఫీల్డ్‌ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న రాకేష్‌ అనే ఉద్యోగి తన స్థానంలో ప్రైవేటు వ్యక్తిని నియమించి తన విఽధులను చేయించడం కలెక్టర్‌ సాక్షిగా బట్టబయలైంది.

కలెక్టర్‌ ఆగ్రహం

కలెక్టరేట్‌లోని కార్యాలయాల తనిఖీల్లో భాగంగా పట్టపగలు విద్యుత్‌ దీపాలు వెలగడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ లైన్లు స్వీచ్‌ ఆఫ్‌ చేసేందుకు సమయం లేక పోతే తనకు ఫోన్‌ ద్వారా సమచారం అందిస్తే తాను వచ్చి లైట్లు ఆఫ్‌ చేస్తానని కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు.

పోలింగ్‌ ప్రక్రియను పకడ్బంధీగా నిర్వహించాలి

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పోలింగ్‌ అధికారులు, సహాయ అధికారులు తమకు అప్పగించిన విధులను పకడ్బంధీగా నిర్వహించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో గురువారం పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె హరిత, సాధారణ పరిశీలకులు అలోక్‌కుమార్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఐఎఫ్‌ఎస్‌ఐ అధికారి భార్గవ్‌ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో ఉంటాయని చెప్పారు. పోలింగ్‌ ప్రక్రియలో చిన్న పొరపాటు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేలా ఇతర పోలింగ్‌ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎక్కడ ఉల్లంఘించకూడదని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 10:38 PM