Share News

సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవు

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:27 PM

ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు సమయ పాలన పాటించకుంటే చ ర్యలు తప్పవని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ హెచ్చరించారు. బుధవారం పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. పలు కా ర్యాలయాల్లో అధికారులు సమయానికి హాజరు కాకపోవడంతో 11 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవు
ఆరోగ్య కేంద్రంలో వైద్యులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

-11 మంది అధికారులకు షోకాజ్‌ నోటీసులు

బెల్లంపల్లి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు సమయ పాలన పాటించకుంటే చ ర్యలు తప్పవని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ హెచ్చరించారు. బుధవారం పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. పలు కా ర్యాలయాల్లో అధికారులు సమయానికి హాజరు కాకపోవడంతో 11 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అనంతరం తహసీల్దార్‌ కా ర్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ సదస్సు ల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. దరఖాస్తులు త్వరగతిన పరిశీలించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది విధుల పట్ల సమయ పాలన పాటించాలని పే ర్కొన్నారు. వివిధ పనుల నిమిత్తం ప్రజలు కార్యాలయానికి వస్తుంటా రని బాధ్యతాయుతంగా వ్యవహరించి జవాబుదారిగా పనిచేయాలన్నారు. అలాగే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని , శుద్ధమైన తాగునీటిని సరఫరా చేయాలని పేర్కొన్నారు. విద్యార్థినులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచిం చారు. తరగతి గదిలో పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి విద్యార్థినుల సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. అలా గే బట్వాన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సందర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వైద్య శిబిరం నిర్వహించాలన్నారు. శిబిరాలకు వచ్చే ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు అందించాలన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 11:27 PM