ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే చర్యలు
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:23 AM
జిల్లాలో చేపట్టిన ఽధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో పాటు రైస్‌మిల్లర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. సిరిసిల జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు
సిరిసిల్ల అర్బన్, జూన్ 17 (ఆంఽధ్రజ్యోతి) : జిల్లాలో చేపట్టిన ఽధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో పాటు రైస్‌మిల్లర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. సిరిసిల జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిలులలో బుధవారం రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖల అధికారులతో పాటు విజిలెన్స్ ఎన్స్‌ఫోర్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్‌లో జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పటివరకు 3.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ సీజన్‌లో అనుకున్న దాని కంటే ఎక్కవ మొత్తంలో ధాన్యం రావడంతో పౌరసరఫరాల కమిషనర్ శాఖ నుంచి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆ టీంలు జిల్లాలో పర్యటిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లులో ఏమైనా అవకతవకలు జరిగితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఈసమావేశంలో డీఆర్వో జయశ్రీ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.