kumaram bheem asifabad- ‘పుర’ పన్నుల చెల్లింపునకు ‘బిల్ వన్’
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:29 PM
పురపాలక సంఘాల్లో పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు ప్రభుత్వం బిల్‌వన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఆస్తిపన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్సు ఫీజులతో సహా పలు పురపాలక బకాయిలను ఒకే వేదిక ద్వారా ఒకే లావాదేవీలో చెల్లించే సాంకేతిక తను అందుబాటులోకి తీసుకవచ్చింది. ఇటీవీల హైదారాబాద్‌లో పురపాలక పరి పాలన కమిషనర్, డైరెక్టర్ శ్రీదేవి లాంఛనం గా ప్రారంభించారు.
కాగజ్‌నగర్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘాల్లో పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు ప్రభుత్వం బిల్‌వన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఆస్తిపన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్సు ఫీజులతో సహా పలు పురపాలక బకాయిలను ఒకే వేదిక ద్వారా ఒకే లావాదేవీలో చెల్లించే సాంకేతిక తను అందుబాటులోకి తీసుకవచ్చింది. ఇటీవీల హైదారాబాద్‌లో పురపాలక పరి పాలన కమిషనర్, డైరెక్టర్ శ్రీదేవి లాంఛనం గా ప్రారంభించారు. తాజాగా అన్నీ మున్సిపా లిటీల్లో అమల్లోకి వచ్చింది. ఆస్తి పన్ను గురించి సంఖ్య(పీటీఐఎన్)తో అనుంసధాన మైన అన్ని పురపాలక సేవలను కవర్ చేస్తే ఒకే డిమాండ్ నోటీసులను జారీ చేయడం ఈ కొత్త విధానం ముఖ్య ఉద్దేశ్యం. దీని వల్ల పురపాలక సంస్థలు పలు నోటీసులు జారీ చేయడం లేదా పదే పదే సందర్శనలు చేయాల్సిన అవసరం కూడా తుగ్గుతుంది. పన్ను బకాయిలను పాక్షికంగా, విడతల వారీగా చెల్లించే పద్ధతిని కూడా ఇందులో ప్రవేశపెట్టినట్లు అధికారులు చెబు తున్నారు. తద్వారా బకాయిలను సకాలంలో చెల్లించడం సులభమవుతుంది. కాగా ఈ విధానం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించే వారికి మాత్రమే అందుబాటులో ఉంది. టిమ్ పరికరాల్లో సాఫ్ట్‌వేర్ ఉన్నతీకరిస్తే పూర్తి స్థాయిలో అమలువుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో..
మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఆస్తి పన్ను నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్సు ఫీజులను ఆన్‌లైన్‌లోనే గాని ఆఫ్ లైన్‌లో గాని ఒకేసారి చెల్లించే అవకాశం లేదు. మున్సిపాల్టీ సిబ్బంది ఒక సారి ఆస్తి పన్ను క్సోం ఇంటికి వస్తే, మరోసారి నల్లా బిల్లు కోసం, ఇంకోసారి ట్రేడ్ లైసెన్సు ఫీజులు చెల్లించాలని దుకా ణాలను చుట్టు తిరుగుతున్నారు. మూడు రకాల బిల్లులు వసూలు కోసం వేర్వేరు బృందాలను నియమించాల్సి వస్తోంది. దీంతో పని సిబ్బందిపై పని భారం ఎక్కువగా పడటమే కాకుండా వసూళ్లలో జాప్యం జరుగుతోంది. ఈ కొత్త విధానంలో ఒకేసారి మొత్తం బిల్లు చెల్లించడం భారమవుతుంద నుకుంటే విడతల వారిగా చెల్లించుకునే వెలుసుబాటు కల్పించారు. చెల్లింపు సకాలంల చేయక పోతే పన్నుపై వడ్డీ భారం పడుతుంది. తెలంగాణ పురపాలక శాఖ వెబ్ సైల్‌లో బిల్ వన్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబరు(పీటీఐఎన్) ను లేదా అసెస్‌మెంటుకు రిజిస్టర్ అయిన సెల్‌ఫోన్ నంబర్ చేయాలి. అప్పుడు ఫోన్‌కు ఓటీపీ వస్తోంది. దాన్ని ఎంటర్ చేయగానే సదరు ఆస్తి పై ఉన్న ఇంటి పన్ను, నల్లా బిల్లు, ఆస్తిని వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తే అందుకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎంత మేర ఉందో, బిల్లు చెల్లింపులల బకాయిలతో సహా చూపుతోంది.. కొత్త విధానంతో బిల్లుల వసూలుకు మూడు సార్లు యాజమాని వద్దకు సిబ్బంది తిరుగాల్సిన అవసరం ఉండదు. సిబ్బంది ఇతర సేవలకు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల ప న్నుల చెల్లింపుల ప్రక్రియ సులభతరం అవడం, బకాయిల నిర్వహణ పారదర్శకంగా ఉండడం, పౌరులకు సమయం ఆదా కావ డం వంటి ప్రయోజనాలు కానున్నాయి. జిల్లా లో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో అమలు చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ విషయమై కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ తిరుపతిని వివరణ కోరగా, బిల్ వన్ విధానం అమల్లోకి వచ్చిం దని చెప్పారు. త్వరలోనే సిబ్బందికి, ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.