Share News

kumaram bheem asifabad- ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:26 PM

ఎరువుల అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి అధికారి వెంకట్‌ తెలిపారు. మండల కేంద్రంలో శనివారం ఎరువుల డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను విక్రయించాలని చెప్పారు. విక్రయించిన వాటికి సంబంధించిన రశీదును కూడా తప్పకుండా రైతులకు ఇవ్వాలన్నారు.

kumaram bheem asifabad- ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాశాఖ అధికారి వెంకట్‌

దహెగాం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఎరువుల అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి అధికారి వెంకట్‌ తెలిపారు. మండల కేంద్రంలో శనివారం ఎరువుల డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను విక్రయించాలని చెప్పారు. విక్రయించిన వాటికి సంబంధించిన రశీదును కూడా తప్పకుండా రైతులకు ఇవ్వాలన్నారు. నిషేధిత మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రైతులు ఎరువుల దుకాణాలపై ఫిర్యాదులు చేస్తే తప్పకుండా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఏవో రామకృష్ణ, ఏఈవో వినోద్‌, అప్రోజ్‌, లావణ్య, రోహిణి పాల్గొన్నారు.

పెంచికల్‌పేట, (ఆంద్రజ్యోతి): ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట్‌ అన్నారు. పెంచికల్‌పేట్‌ రైతు వేదికలో ఎరువుల డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీలర్లు తమ స్టాక్‌ వివరాలు బోర్డుపై ఉంచాలన్నారు. ప్రభుత్వం నిషేధించిన మందులను అమ్మితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు రవీందర్‌, శ్రీనివాస్‌, వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 11:26 PM