Share News

kumaram bheem asifabad- అనుమతి లేకుండా గైర్హాజరైతే చర్యలు

ABN , Publish Date - Sep 23 , 2026 | 11:03 PM

వైద్య సిబ్బంది అనుమతి లేకుండా విధులనకు గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హరిత హెచ్చరించారు. మండలంలోని రొంపెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక, మందుల నిల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు తనిఖీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా వైద్యాధికారి ఆసుపత్రికి గైర్హాజరుకావడంపై ఫోన్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సమాచారం అందించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

kumaram bheem asifabad- అనుమతి లేకుండా గైర్హాజరైతే చర్యలు
ఆసుపత్రిలో మందుల నిల్వలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత

తిర్యాణి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది అనుమతి లేకుండా విధులనకు గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హరిత హెచ్చరించారు. మండలంలోని రొంపెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక, మందుల నిల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు తనిఖీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా వైద్యాధికారి ఆసుపత్రికి గైర్హాజరుకావడంపై ఫోన్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సమాచారం అందించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం రొంపెల్లి గ్రామంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న హియరింగ్‌ ప్రక్రియను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా చేపట్టిన హియరింగ్‌ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిర్యాణి మండలం మ్యాపింగ్‌ కాని, అనమలిస్‌ జాబితాలో ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించిన ఓటర్లు అందిస్తున్న ఽద్రువ పత్రాల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు, ఓటరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. అనంతరం ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, నాణ్యత, విద్యా, బోధన, కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గణనాథుడిని వద్ద పూజలు చేశారు. రొంపెల్లి గ్రామంలోని మెస్రగూడ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆదివాసి ఇండ్ల గోడలపై వేసిన ముగ్గులను చూసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మర్కగూడ గ్రామంలో గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించి సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 11:03 PM